మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే చిరంజీవి చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు గురించి పెద్దగా పరిచయం చేయన అవసరం లేదు. కానీ చిరంజీవి రెండో తమ్ముడు నాగబాబు భార్య పద్మజా గురించి పెద్దగా ఎవరికి ఏమీ తెలియదు. 29 సంవత్సరాల వయసులో నాగబాబుకు పద్మజతో వివాహం జరిగింది.
వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. నాగబాబు తల్లి అంజనాదేవి పాలకొల్లులో వారి బంధువుల పెళ్ళిలో పద్మజను మొదటిసారిగా చూశారట. మొదటి చూపులోనే పద్మజ అంజనాదేవిని ఎంతగానో ఆకర్షించిందట. వెంటనే అంజనాదేవి గారు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని. వారిది మంచి కుటుంబం కావడాంతో ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఎంతో పద్ధతిగా పెరిగిందని తెలియడంతో నాగబాబుకు భార్యగా ఆమెని ఫిక్స్ అయిపోయారట.
అంతేకాకుండా నాగబాబుతో పాటు ఇంట్లో వారందరికీ కూడా పద్మజ ఎంతో నచ్చిందట. వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడుకుని వెంటనే నాగబాబు- పద్మజలకు ఎంతో ఘనంగా వివాహం కూడా జరిపించారు. నాగబాబు తో పెళ్లి తర్వాత పద్మజ ఓ సంపూర్ణ గృహిలా మారిపోయింది. నాగబాబుకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ ఆయనను అన్నీ తానై చూసుకుంది. ఈ దంపతులకు వరుణ్ తేజ్, నిహారిక జన్మించారు. నిహారికకు పెళ్లి జరిగింది అలాగే విడాకులు కూడా తీసుకున్నీ నిహరీక ప్రస్తుతం ఓంటరిగా ఉంటుంది.. వరుణ్ తేజ్‌కు కూడా లావణ్య త్రిపాఠి తో రీసెంట్‌గానే పెళ్లి కూడా జరిగింది.
అన్నట్లు పద్మజ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమెచిన్నప్పటినుంచి కూడా మెగాస్టార్ చిరంజీవికి విరాభిమాని అట. చిరంజీవికి సంబంధించిన అనేక పేపర్ కటింగ్స్ ను ఈమె సేకరించి వాటిని బుక్కు లాగా కూడా తయారు చేసుకుందట. ఈ విషయం తెలిసి అంజనాదేవి తెగ మురిసిపోయారట. మొత్తానికి అభిమాన హీరో ఇంటికే పద్మజ కోడలిగా వెళ్లిందన్నమాట.