సినీ నటి నగ్మా కేవలం తెలుగు ప్రజలకే మొత్తం భారతదేశానికి తెలుసు. ఎందుకంటే ఆమె తెలుగులోనే కాదు. తమిళ్, కన్నడ , మలయాళం, హిందీలలో కూడా నటించింది. బాలీవుడ్ లోని అందరు ప్రముఖ హీరోల సరసన నటించింది అంటే నగ్మా సినీ పరిశ్రమలో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలుసుకోవచ్చు. కానీ, అలాంటి నగ్మా నిజ జీవితంలో పెళ్లి చేసుకోలేదు. ఇప్పటివరకూ అలా సింగిల్ గానే ఉండిపోయింది. ఇందుకు ఆమె కారణాలు మనకు తెలియకపోయినా అప్పట్లో ఆమె నడిపిన ఒక ప్రేమకథను మాత్రం ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంది.
అదే నగ్మా ఒక ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్ ని ప్రేమించడం. అతను ఎవరో కాదు.. ఒకప్పటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ సౌరభ్ గంగూలీ. అవును మీరు చదివింది నిజమే. గంగూలీతో నగ్మా ప్రేమ వ్యవహారం నడిపింది. గంగూలీకి అప్పటికే పెళ్లయిపోయి ఉన్నా కూడా అతనితో ఈ అఫైర్ కొనసాగించింది అన్న ఆధారాలు ఉన్నాయి. గంగూలీ మ్యాచ్ లు ఆడటానికి వెళ్ళినప్పుడు నగ్మా కూడా అక్కడికి హాజరయ్యేది. ఇది మీడియా చాలాసార్లు పట్టేసింది. వీళ్ళిద్దరూ అలా మ్యాచ్ సందర్భాలలో మాత్రమే కాకుండా.. అనేక ఇతర సందర్భాలలో కలిసి తిరిగేవాళ్లట.
ఈ తర్వాత కాలంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన గంగూలీ ఒకప్పుడు అలా ఆమెతో ప్రేమలో ఉన్నాడన్న మాట. ముందుగా తనే ప్రేమించినప్పటికీ నగ్మా కూడా తొందరగానే ఓకే చెప్పేసిందట. ముఖ్యంగా 1999 ప్రపంచ కప్ టైమ్ లో గంగూలీతో పాటు నగ్మా కనిపించడం, వాళ్ళిద్దరూ కలిసి మన శ్రీకాళహస్తిలో ఉన్న ఆలయానికి వచ్చి పూజ కూడా చేశారట. కానీ వీళ్ళిద్దరూ విడిపోదానికి ఒక ప్రధాన కారణం.. ఆ టైమ్ లో ఇద్దరి కెరీర్స్ కూడా మంచి పీక్స్ లో ఉండటం.
Leave a comment