Muvva Gopaludu: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ కాంబినేషన్ అంటే ఓ బ్రాండ్ అన్నట్లు ఉండేది. అంతేకాదు, ఈ కాంబోకి ప్రేక్షకాభిమానుల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అప్పటికే బాలయ్య కెరీర్లో ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ‘మంగమ్మ గారి మనవడు’ (1984) కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కలయికలోనే వచ్చింది.
తర్వాత వచ్చిన ‘ముద్దుల కృష్ణయ్య’ సూపర్ హిట్.. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘మువ్వగోపాలుడు’.. తమిళ్లో ప్రభు హీరోగా నటించిన ‘అరువదై నాల్’ (Aruvadai Naal) చిత్రానికిది రీమేక్. 1987 జూన్ 19న విడుదలైన ‘మువ్వగోపాలుడు’ 2022 జూన్ 19 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
బాలయ్య, విజయశాంతి కాంబినేషన్.. క్రేజీ కాంబినేషన్.. శోభన కూడా మరో కథానాయికగా నటించింది. లివింగ్ స్టన్ స్టోరీ, గణేష్ పాత్రో డైలాగ్స్, కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ‘మువ్వగోపాలుడు’ సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది.
కె.వి. మహదేవన్ సాంగ్స్ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ముత్యాల చెమ్మచెక్కలు’ సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. పాటలన్నీ ప్రజాదారణ పొందాయి.. బాలయ్య ఇమేజ్‌ని మరింత పెంచడంతో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత చేరువ చేసిందీ చిత్రం.. రావు గోపాల రావు, జయచిత్ర, గొల్లపూడి తదితరుల క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి.
తెలగునాట రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి.. బాక్సాఫీస్ బరిలో బాలయ్య స్టామినా ఏంటనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది. బాలయ్య, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి కలయికలో వచ్చిన ‘మువ్వగోపాలుడు’ ఈ త్రయం కెరీర్లో స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుంది.
Leave a comment