తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ, హరికృష్ణ ఈ కుటుంబంలో రెండో తరం హీరోలుగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హరికృష్ణ తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లోనూ అలాగే రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు. అయితే హరికృష్ణ తన కెరీర్ లో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. చేసిన తక్కువ సినిమాలైనా ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు.
హరికృష్ణ నటించిన సినిమాల్లో సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, లాహిరి లాహిరిలో వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇదే సమయంలో హరికృష్ణతో ఎక్కువ సినమాలు చేసిన దర్శకుడు కూడా వైవిఎస్ చౌదరి. ఈ క్రమంలోనే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన లాహిరి లాహిరిలో సినిమాలో ఒకీలక పాత్రలో హరికృష్ణ నటించారు. చాలా సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర.. రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం హరికృష్ణ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నటించడం అందర్నీ షాక్ గురి చేసింది.
ఈ సినిమాలో విలన్ గా నటించిన జయప్రకాశ్ రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండు రైల్వే ట్రాక్ పైకి వచ్చి సరిగా మధ్యలో ఆగిపోతాయి కొద్దిసేపటి వరకు ఎవరు వెనక్కి దగ్గరు అదే సమయంలో ట్రైన్ వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి తీస్తాడు. ఇక అప్పుడు హరీకృష్ణ కారు ముందుకు వెళ్లాలి కానీ కారు స్టార్ట్ కాదు ఎంత స్టార్ట్ చేసినా అవదు ఒకపక్క ట్రైన్ వచ్చేస్తుంది.
కానీ హరికృష్ణ ఏం మాత్రం భయపడకుండా మరో రెండు మూడు సార్లు కార్‌ను స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు మూడోసారి కార్ స్టార్ట్ అయింది. వెంటనే ముందుకు దూకించాడు హరికృష్ణ. అలాంటి సమయంలో హరికృష్ణ భయపడి ఏం చేయకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇక ఈ సన్నివేశం తెరకెక్కించే సమయంలో కారులో మరెవరైనా ఉంటే కచ్చితంగా భయపడి హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ హరికృష్ణ మాత్రం ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశంలో నటించిరు. ఇక ఈయన ధైర్యానికి వైవిఎస్ చౌదరి ఎంతగానో మెచ్చుకున్నారట. అలా సినిమాలోని సన్నివేశం కోసం తన ప్రాణాలను సైతం హరికృష్ణ లెక్కచేయలేదని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.