నందమూరి కుటుంబం నుండి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న కొద్ది మందిలో ఒకరు కళ్యాణ్ రామ్. హరిక్రిష్ణ కొడుకుగా.. రామారావ్ గారి మనవడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా ఆయనకి తొలుత పరాజయలు తప్పలేదు. ఇండస్ట్రీ లోకి రావడానికి ఎలాంటి అవకాశం ఉన్నా.. అందుకు చేయాల్సిన ప్రయత్నం సరిగ్గా చేయకపోతే ప్రేక్షకులు ఆదరించరు అనేది అర్థం చేసుకున్న వాళ్ళు స్టార్స్ అవుతారు.
ఆ కోవలోకి చెందిన ఒక వ్యక్తే నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ బిగినింగ్ లో.. తొలి చూపులోనే, అభిమన్యు వంటి సినిమాలతో కాస్త పరాజయాలు చూసినా అతనొక్కడే సినిమాతో హిట్ కొట్టారు. ఆ సినిమాకి డైరెక్టర్ గా పని చేసిన సురేందర్ రెడ్డికి అదే మొదటి సినిమా. ఆ తర్వాత అసాధ్యుడు, విజయదశమి, లక్ష్మీ కళ్యాణం మంచి హిట్లుగా నిలిచాయి. 2008 లో వచ్చిన హరే రామ్ మూవీ పెద్ద హిట్. 2013 లో రామ్ ఒక కొత్త ప్రయత్నానికి కూడా దారులు వేసే ప్రయత్నం చేశారు.
ఇండియాలోనే మొదటి 3D యాక్షన్ సినిమాగా తీసుకొచ్చారు ‘ఓం’ అనే సినిమాని. ఆ మూవీ సక్సెస్ ని అందుకోలేకపోయినా.. మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత పటాస్, షేర్, ఇజం, mla,నా నువ్వే వంటి సినిమాల్లో చేశాక.. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్స్ అయిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో నందమూర్తి హరికృష్ణగా నటించారు కళ్యాణ్ రాం.
ప్రస్తుతం బింబిసార సినిమాతో ప్రేక్షకులకు మరింత కొట్టగా ఒక చారిత్రక నేపథ్యాన్ని చూపించాలనుకుంటున్న కళ్యాణ్ రామ్ మరి కొన్ని ప్రాజెక్ట్ లతో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన మరిన్ని మంచి మూవీస్ తీయాలని, మరింత సక్సెస్ కి చేరుకోవాలని కోరుకుంటూ మరోసారి కళ్యాణ్ రామ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Leave a comment