Naresh: గత కొద్ది రోజులుగా నరేష్- పవిత్ర లోకేష్ పేర్లు మీడియాలో తెగ నానుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వారి రిలేషన్ షిప్పై సైలెంట్ మెయింటైన్ చేసిన నరేష్ మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్లో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాము రిలేషన్ లో ఉన్న విషయాన్ని ఒప్పుకోవడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద హాట్ టాపిక్ అయింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని మళ్లీ పెళ్లి అనే సినిమాను తెరకెక్కించగా, ఇందులో నరేష్- పవిత్ర లోకేష్ లిప్ లాక్ సీన్ అందరికి పెద్ద షాకిచ్చింది. 60 ఏళ్ళ వయసులో అవసరమా అంటూ చాలా మంది తిట్టిపోసారు.
xxxxxxxxxx
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్ లాక్ వెనుక ఉన్నటువంటి స్టోరీని రివీల్ చేశాడు నరేష్. లిప్ లాక్ సన్నివేశం పెట్టడం కోసం పవిత్ర తనని చాలా ఇబ్బంది పెట్టిందని నరేష్ అన్నాడు. సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని చెప్పగానే ఒక్కసారిగా పవిత్ర లోకేష్ షాక్ అయిందని , తాను ఈ సన్నివేశంలో నటించనని నిర్మోహమాటంగా చెప్పిందని నరేష్ తెలియజేశారు. అయితే ఆ సన్నివేశంలో నటించమని పవిత్రని మూడు రోజులపాటు బ్రతిమలాడినట్టు నరేష్ అన్నాడు. నేను అంతగా బ్రతిమలాడటంతో చివరికి ఈ సన్నివేశంలో నటించడానికి పవిత్ర ఒప్పుకుందని లిప్ లాక్ సన్నివేశం వెనుక ఉన్న స్టోరీని నరేష్ రివీల్ చేశాడు.
అయితే సినిమాలోని ఓ సన్నివేశంలో నటించడానికి పవిత్ర లోకేష్ వెనకడుగు వేసిన కూడా సినిమా ప్రమోషన్లలో మాత్రం బహిరంగంగా పలు వేదికపైనే ఇద్దరు ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకోవడం మనం చూశాం. కాగా, పవిత్ర లోకేష్, నరేష్ ల గురించి గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. వారిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అనేక రకాల కథనాలు వచ్చిన కూడా వారు ఏ మాత్రం స్పందించలేదు. నరేష్ భార్య కూడా ఆ విషయంలో తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలియజేస్తూ ఓ సారి వారిద్దరి రెడ్ హ్యాండెడ్గా పట్టించింది.