Rashmika: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందం, నటనతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ..టాలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. ఈ అమ్మడు ఇటీవల తన అందచందాలతోను అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే వార్తలతో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఆ మధ్య రిపోర్టర్.. రష్మికని మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అని ప్రశ్నించగా, దానికి స్పందించిన రష్మిక.. ‘నాకు ఎప్పుడో పెళ్లైపోయింది’ అని చెప్పి అందరికి పెద్ద షాకిచ్చింది. ‘నాకు నరుటో తో పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది రష్మిక.
ఆ నరుటో ఎవరనే డౌట్ అందరికి వచ్చింది. జపనీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’ లోని ఫేమస్ పాత్ర కాగా, ఈ సిరీస్ కు అందులోని పాత్రలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నరుటో పేరు చెప్పి ఒక్కసారి అందరికి ఝలక్ ఇచ్చింది రష్మిక. ఈ అమ్మడు ఇటీవల బాలీవుడ్లో చేసిన సినిమాలు మంచి సక్సెస్‌ని అందించలేకపోయాయి. ప్రస్తుతం రష్మిక హోప్స్ అన్నీ కూడా పుష్ప2 పైనే పెట్టుకుంది. పుష్ప చిత్రంతో రష్మికకి పాన్ ఇండియా స్టార్డం రాగా, పుష్ప 2 చిత్రంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరగనుందని అంటున్నారు. దీంతో పాటు రష్మిక.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తోపాటు ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.
కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా చూస్తే.. రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందనే ప్రచారం ఉంది. వీరు ఈ విషయాన్ని పైకి చెప్పట్లేదు కానీ సీక్రెట్ గా మాత్రం వెకేషన్లకు వెళుతూ వస్తున్నారు. రీసెంట్గా రష్మిక తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. విజయ్ దేవరకొండతో మీ తర్వాత మూవీ ఎప్పుడు ఉంటుంది అని ఓ నెటిజన్ అడగగా, అది మీరు విజయ్ నే అడగాలి అని చెప్పింది రష్మిక. ఇక మంచి స్టోరీతో ఎవరైనా డైరెక్టర్ వస్తే చేయడానికి మేం రెడీగా ఉన్నామని పేర్కొంది.. విజయ్ దళపతి, షారుఖ్, విజయ్ దేవరకొండలలో మీరు ఎవరికి లిప్ లాక్ ఇస్తారు అని మరో నెటిజన్ అడగగా, ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ముగ్గురికి ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక రష్మిక అనేక విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది.