NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణకి మాస్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వీరాభిమానులు వీర లెవల్లో ఉంటారనే సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల పాటు కర్నూలు పరిసరప్రాంతాలు బాలయ్య నామస్మరణతో మారుమ్రోగిపోయాయి.
బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 107 జూలై 20 నుండి 25 వరకు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరపుకుంది. జూలై 26న పంచలింగాల వద్ద షూటింగ్ చెయ్యాలనుకున్నారు కానీ వర్షం కారణంగా షెడ్యూల్ ముగించుకుని టీం హైదరబాద్ వచ్చేశారు.
షూటింగ్ జరిగినన్ని రోజులు బాలయ్యను చూడ్డానికి రాయలసీమలోని పలు ప్రాంతాలనుండి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండారెడ్డి బురుజు జనసంద్రాన్ని తలపించింది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరినుండి పండు ముసలి వరకూ అందరూ బాలయ్యను చూడ్డానికి వచ్చారు.
పోలీసు వారితో సహా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ వారికి చాలా ఓపిగ్గా ఫొటోలిచ్చారు బాలయ్య. ఓ అభిమానిని గుర్తుపెట్టుకుని మరీ పిలిచి అతని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. బుల్లి అభిమానిని ఆడించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Leave a comment