Salaar: ఆదిపురుష్ చిత్రం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ చిత్రం చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ రోజు ఉదయం చిత్ర టీజర్ విడుదల చేయగా,ఈ టీజర్ విడుదలైన కొద్దిగంటలలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ వ్యూస్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. చిత్ర టీజర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఒకవైపు సలార్ టీజర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంటే మరోవైపు దీనిపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్‌కి ఎలా నెగెటివిటీ వచ్చిందో ఇప్పుడు సలార్ టీజర్‌పై కూడా అలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. `సలార్` టీజర్ ఏమాత్రం బాగాలేదని, అంచాలను అందుకోలేకపోయిందని, ప్రభాస్‌ని సరిగ్గా చూపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే `డిజప్పాయింట్` అనే ట్యాగ్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. `సలార్ డిజప్పాయింట్` అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి కొందరు మాత్రం ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో ప్రజెంట్ చేశాడని, బీజీఎం కూడా అదిరిపోయిందని చెప్పుకొస్తున్నారు.
టీజర్లో విజువల్స్ అంత క్లారిటీ లేవని, వీఎఫ్ఎక్స్ క్వాలిటీగా లేవని అంటున్నారు. `సలార్` పై భారీ అంచనాలు పెట్టుకోగా, ఇప్పుడు ఇలా నెగెటివ్ టాక్ రావడం ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగిస్తుంది. ఇక దీనిని రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్నట్టు టీజ్ ద్వారా హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత వరుస ఫ్లాపులలతో సతమతం అవుతున్న ప్రభాస్‌కి ఈ సినిమా హిట్ తప్పనిసరి. లేదంటే మనోడి పరిస్థితి దారుణంగా మారుతుంది. దాదాపు 400కోట్లతోహోంబలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.