Niharika Husband: అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత సైలెంట్‌గా విడాకులు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఎవరైన పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటే వారం ముందు నుండే నానా హంగామా ఉంటుంది. హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా ఒకటేంటి నానా హంగామా చేసుకుంటూ వివాహం చేసుకుంటున్నారు. కాని ఏదైన విషయంలో మనస్పర్థలు వచ్చి ఇక కలిసి ఉండలేమని అనిపిస్తే సైలెంట్‌గా విడాకులు తీసుకుంటున్నారు. సమంత- నాగ చైతన్య విడాకుల విషయం గురించి ఎన్నో ప్రచారాలు సాగగా, ఆ తర్వాత అక్టోబర్ 2, 2021న తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన శ్రీజ, నిహారిక విడాకుల గురించి ఇంత వరకు పూర్తి క్లారిటీ లేదు.
కొన్నాళ్లుగా మెగా అల్లుళ్లు ఇద్దరు వారి ఇంట్లో జరిగే వేడుకలలో కనిపించడం లేదు. అలానే వారి సోషల్ మీడియా పోస్ట్‌లు విడాకులు తీసుకున్నారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, అవి రెండు పెటాకులు అయ్యాయి. ఇక నిహారిక విషయానికి వస్తే ఈ అమ్మడు జొన్నలగడ్డ వెంకట చైతన్యని వివాహం చేసుకుంది. ఎంతో అట్టహాసంగా వీరి పెళ్లి జరిగింది. కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నారు. కాని ఏమైందో ఏమో కాని కొద్ది నెలల క్రితం చైతన్య తన ఇన్‌స్టాగ్రాములో నిహారిక పెళ్లికి సంబంధించిన పిక్స్ అన్నీ డిలీట్ చేశాడు.
ఇక వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్లో నిహారిక తన భర్తతో కాకుండా సోలోగా కనిపించింది. దీంతో వారిరివురు దూరంగా ఉంటున్నారు, విడాకులు కూడా తీసుకున్నారు అని అందరు కన్ఫాం అయ్యారు. అయితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని చైతన్య చాలా నెలల తర్వాత తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ముంబైలోని గ్లోబల్ విపస్సనా పగోడా మెడిటేషన్ సెంటర్ ఫోటోలు షేర్ చేసిన ఆయన ఇలాంటి స్థలానికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. పది రోజుల నుండి నేను విపస్సనా యోగను చేయడం వల్ల నా జీవితం ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది అని అన్నాడు. నిహారిక జ్ఞాపకాలు తొలగించుకునేందుకు తాను అక్కడికి వెళ్లాడా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.