నందమూరి తారకరామారావ్. అటు సినీ ప్రపంచంలో, ఇటు రాజకీయ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు. కోట్లాది మంది తెలుగు వాళ్ళకి ఆయన ప్రీతి పాత్రుడు. అలాంటి వ్యక్తి ఎక్కువగా ప్రేమించిన విషయాల్లో తెలుగు జాతి మాత్రమే కాదు.. ఆయన కుటుంబం ముఖ్యంగా ఆయన భార్య కూడా ఉన్నారు. ఎన్టీఆర్ గారు సినీ ప్రపంచం నుండి.. రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి ముఖ్యమంత్రి అయిన సంవత్సరం 1983. ఆ టైమ్ లోనే ఆమె స్వల్పంగా ఆరోగ్య సమస్యతో ఉన్నట్టు చెప్తారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న కొంత కాలానికే ఆమె క్యాన్సర్ తో పోరాడలేక చనిపోయారు.
ఆమె మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ఆయన తన భార్యని కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత వచ్చిన 1989 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన చాలా సమయం దొరికింది. ఆ టైమ్ లోనే తన భార్య కాన్సర్ కారణంగా చనిపోయిన విషయంపై మళ్ళీ పునరాలోచించడం మొదలుపెట్టారు. ఆమెలాగా ఇంకెవ్వరూ కాన్సర్ తో చనిపోకూడదు అన్న గొప్ప ఆలోచనతో ఒక కాన్సర్ హాస్పిటల్ ని కట్టించాలి అనుకున్నారు. కానీ, హాస్పిటల్ కట్టించటం అంటే మాటలు కాదు. ఒక నేతగా ఒక పదవీకాలం పూర్తి చేసిన ఆయన అవినీతి చేయలేదు. అందుకే ఇలాంటి ఒక అరుదైన హాస్పిటల్ ని కట్టించాలంటే ఆయన దగ్గర డబ్బు లేదు.
ఆ సంధర్భంలోనే ఆయనకి వచ్చిన ఆలోచన ఒక స్వతహాగా బాగా డబ్బు సమకూర్చి ఈ హాస్పిటల్ కట్టాలని. అందుకోసం ఈ సమయంలో మూవీ తీయాలి అనుకున్న విషయాన్ని అందరు నిర్మాతలకీ తెలియజేశారు. ఆయన భార్య బసవతారకం పేరు మీద హాస్పిటల్ కట్టించడం కోసం కావాల్సిన డబ్బు సమకూరేలా.. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళతో సినిమా చేస్తానని ప్రకటించారు. ఆ టైమ్ లోనే మోహన్ బాబు నిర్మాతగా తీసిన సినిమా ‘మేజర్ చంద్రకాంత్’. ఈ సినిమా ఎంత సక్సెస్ చూసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే, రామారావు గారు అనుకున్న కాన్సర్ హాస్పిటల్ కల కూడా నెరవేరింది.
Leave a comment