Megastar: ప్రస్తుతం మెగా ఫ్యామిలీ పేరు తెలుగు రాష్ట్రాలలో మారు మ్రోగిపోతుంది. అందుకు కారణం నిహారిక విడాకులు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విడాకులు, శ్రీజ విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో నిహారిక తాను తన భర్త నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయం వినగానే చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో కలవలేకపోవడం వల్లనే విడాకులు తీసుకుందని అనుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీలో పెరిగిన నిహారిక.. ప్రతినిత్యం పార్టీలు, పబ్బులు, వెకేషన్ అంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది జొన్నలగడ్డ ఫ్యామిలీకి నచ్చకపోవడంతోనే విడాకులు ఇచ్చి ఉంటారనే వాదన వినిపిస్తుంది.
ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చి కళ్యాణ్ దేవ్ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా అతనితో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుండగా, అతనికి కూడా శ్రీజ విడాకులు ఇచ్చిందని టాక్. మరి కొద్ది రోజులలో ఈమె కూడా తన విడాకులపై అఫీషియల్ ప్రకటన చేయనుందని అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా పెటాకులు అయిందని, మూడో భార్య తన పిల్లలతో కలిసి రష్యా వెళ్లిపోయిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే దీనిపై స్పందించిన జనసేన పార్టీ పవన్, అన్నా కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ఇది ఇప్పటి పిక్ కాదని, ఎడిట్ చేసారని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ విడాకుల వ్యవహారాలు మెగా ఫ్యామిలీపై తీవ్రమైన నెగెటివిటీని పెంచుతున్నాయి. చిరంజీవి కూడా ఈ విషయంలో చాలా అప్సెట్గా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం ఫారెన్ ట్రిప్ వేసాడని చెప్పుకొస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ ఆగష్టు 11న విడుదల కానుండగా, రీసెంట్గా ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేశారు చిరు. ఈ క్రమంలో తను,తన వైఫ్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళుతున్నారు.ఇక తన ట్రిప్ గురించి చిరంజీవి సోషల్ మీడియాలో తెలియజేశాస్తూ.. పిక్ కూడా షేర్ చేశారు. ఈ ట్రిప్ ముగించుకుని వచ్చాక కూతురు సుస్మిత బ్యానర్ లో మూవీ చేయనున్నాడని, ఈ చిత్రం బింబిసార డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నాడని టాక్.