OTT Releases: ఒకప్పుడు ఓటీటీ అంటే ఎవరికి తెలిసేది కాదు. కాని కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఓటీటీలకి ఫుల్ డిమాండ్ పెరిగింది. థియేటర్‌కి వెళ్లడం మానేసి ఇంట్లోనే కూర్చొని హాయిగా కుటుంబ సభ్యులతో ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లని వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వైవిధ్యమైన కంటెంట్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి వారం కూడా ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్ లు వస్తున్నాయి. అలానే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రాలు కూడా సందడి చేస్తున్నాయి.
గత వారం ‘బాబీలోన్’, ‘చక్రవ్యూహం’, ‘ఐబీ 71’, ‘రుద్రమాంబపురం’, ‘టక్కర్’ వంటి సినిమాలు, ‘స్వీట్ కారం కాఫీ’ వంటి పలు సిరీస్‌లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఈ వారం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్, సిరీస్ ఓటీటీల్లోకి వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్ లో హాస్టల్ డేస్ (తెలుగు సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది), ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) – (స్ట్రీమింగ్ అవుతుంది), అలానే తందట్టి (తమిళ్ డబ్బింగ్ మూవీ) మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో
బర్డ్ బాక్స్ బార్సిలోనా (స్పానిష్), కొహరా (హిందీ), క్వార్టర్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్), బర్న్ ది హౌస్ ఆఫ్ డౌన్ (జపనీస్ సిరీస్), సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్), మిస్టర్. కార్ అండ్ ది నైట్స్ టెంప్లర్ (ఇంగ్లీష్), ఎన్తిక్కక్కక్కోరు ప్రేమందార్ను( మలయాళం) స్ట్రీమింగ్ అవుతుంది.
జీ5లో చూస్తే.. మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్), జానకి జానీ (మలయాళం) – (స్ట్రీమింగ్ అవుతుంది), ది ట్రయల్ (హిందీ) స్ట్రీమింగ్ అవుతుండగా, ఆహా లో మెన్టు, నేను స్టూడెంట్ సర్ స్ట్రీమింగ్ అవుతుంది. సోనీలివ్ లో క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ (హిందీ) (స్ట్రీమింగ్ అవుతుంది), కాలేజ్ రొమాన్స్ (హిందీ), ఇక జియోలో ఇష్క్ ఈ నాదన్ ( హిందీ సిరీస్) అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లో చూస్తే ఈ రోజు బేబి సినిమా విడుదల కాగా, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.