పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఒక పాత కారునే వాడుతున్నాడు. అప్పుడప్పుడూ తనకి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కార్ తీసుకుని.. తన రాజకీయ అవసరాలకి వాడుకుంటూ ఉంటాడని టాక్. ఎందుకంటే ఆయనకి స్వయంగా కార్ల మీద.. ఆ మాటకొస్తే ఆస్తుల మీద పెద్దగా ధ్యాస ఉండదు అనేది అందరికీ తెలిసిన మాటే.. కానీ కుటుంబ అవసరాల కోసం.. తన స్థాయికి తగ్గట్టు మైన్టైన్ చేయటం కోసం పవన్ ఈ మధ్యనే ఒక కొత్త కారు ని బుక్ చేశారన్న మాట వెలుగులోకి వచ్చింది.
ఆ కార్ కూడా సాదా సీదా కార్ కాదని.. దాదాపు 4 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ అని వినికిడి. ఇలాంటి కార్లు హైదరాబాద్ లో కేవలం కొద్దిమంది సంపన్నుల దగ్గర మాత్రమే ఉన్నాయట. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇంత విలువైన కార్ కొనడం వెనక మరేమైనా కారణాలు ఉన్నాయా అని తెలియాల్సి ఉంది. ఐతే, ఈ మధ్య విడుదలైన వకీల్ సాబ్ మంచి లాభాలు తీసుకువచ్చింది. అదే తరహాలో అయ్యపమ్ సినిమా రీమేక్ చేయడం ద్వారా నిర్మాతలకు మరింత లాభాలు తెచ్చిపెడుతూ.. నటుడిగా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో మరో సినిమాకి కూడా ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Leave a comment