Pawan Kalyan: ఏపీలో వారాహి యాత్ర సక్సెస్ ఫుల్గా సాగుతుంది. ఈ యాత్రకి భారీగా జనసైనికులు హాజరవుతున్న నేపథ్యంలో పవన్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవర్ ఫుల్ స్పీచ్తో అదరగొట్టిన పవన్ నిన్న కాకినాడలో జరిగిన సభలో మరింత పవర్ఫుల్ పంచ్లతో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం అని పిలుపిచ్చిన ఆయన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు
సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నారనీ, ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా రూ.15 వేల కోట్లు వెనక్కి వేసారని ఆరోపించారు. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొట్టడమే నా ధ్యేయం అంటూ తొడగొట్టి సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్లైన్ వేదికగా యుద్ధం చేస్తామని బహిరంగ సభలో ప్రకటించారు జనసేనాని.
కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించారని పవన్ అన్నారు. కుల దూషణ చేస్తూ రెచ్చగొడితే ఏ మాత్రం మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు. తనకు అవకాశం కనుక ఇస్తే ఈ గూండాలను తన్నుకుంటూ తీసుకెళ్తానని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన నేతలను అసెంబ్లీకి పంపిస్తే.. దోపిడీని అడ్డుకుని చూపిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రంలో ఎస్సీ డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన కూడా ఎస్సీ నాయకులు మాట్లాడకపోవడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏకంగా వైసీపీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో కులం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉందని.. ‘మన రాష్ట్రం- మన ఏపీ’ అని అందరూ అనుకోవాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.