బాహుబలి విడుదల అయినప్పటినుంచి పాన్ ఇండియా అనే మాట ఎక్కువగా వింటున్నాం. అంటే ఒరిజినల్ గా ఒక భాషలో విడుదల అయిన సినిమాని ఇతర భాషల్లో కూడా డబ్ చేసే రిలీజ్ చేయగలిగే సినిమాలు అన్నమాట. ఈ ట్రెండ్ ప్రధానంగా బాహుబలి సినిమా నుంచి మొదలైంది. తమిళ్, హిందీలలో కూడా రిలీజై మంచి హిట్ సాధించిన ఈ మూవీ.. ఈ తరహా పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే సినిమాల సక్సెస్ లో ఉండే సాధ్యాసాధ్యాలని నిరూపించింది. అలాగే, ఒకే భాషకి పరిమితం అయి.. మార్కెట్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఉండటం కంటే.. ఎక్కువ భాషల్లో రిలీజ్ అవడం వల్ల.. ఎక్కువ మార్కెట్ కూడా సంపాదించవచ్చు అనే ఆలోచనలతో ఇలాంటి మూవీస్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి.
ఈ మార్కెట్ విధానాన్ని అవలంభిస్తున్న ఒక ముఖ్య కంపెనీ ‘హోంబేల్’ కూడా వరుసగా ఇలా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతుంది. కేజీఎఫ్ కన్నడలో ఛాప్టర్ 1 గా విడుదలై ఏ స్థాయిలో సక్సెస్ చూసిందో మనకు తెలిసిందే. ఆ సినిమాని నిర్మించిన సంస్థే ఈ హోంబేల్. అదే సంస్థ kgf chaaptar 2 తో కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక సినిమాని చేస్తున్నాడు. అదే ‘సలార్. ఈ మూవీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
ఐతే, తెలుగులో మరో స్టార్ కూడా ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఒక సినిమాలో నటిస్తున్న పవన్ తో.. ఆ హోంబేల్ సంస్థ వాళ్ళు ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న పవన్ మరో సినిమాతో ఇలా బిజీ అవబోతున్నాడన్న మాట.
Leave a comment