Apparao: తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆదరణ పొందిన టీవీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో జబర్ధస్త్ అప్పారావు ఒకరు. 1980 నుంచి 2000 వరకు ఆటో మొబైల్ రంగంలో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసిన అతను 30 ఏళ్ల కిందట నుండి రంగస్థల నటుడిగా తన సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ షోతోనే మనోడికి మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత పలు సినిమాలలోను కనిపించి మెప్పించారు. అయితే తాజాగా అప్పారావు ఓ ఇంటర్యూలో యూట్యూబ్ థంబ్ నేయిల్స్ వల్ల నటీనటులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ గురించి చెబుతూ.. చాలా ఎమోషనల్ అయ్యారు. తాను యూట్యూబ్ మీద ఒక నాటిక రాద్దాము అని అనుకుంటున్నాడట. యూట్యూబూ నీకో దండం. చాలా బాధతో ఈ విషయం చెబుతున్నాను అని అన్నారు.
ఇటీవలి కాలంలో కొందరు ప్రముఖులని బ్రతికుండగానే చంపేస్తున్నారు.చెత్త థంబ్ నెయిల్స్ పెట్టి నటీనటులని చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇది నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. చనిపోకముందే చనిపోయినట్టు రాయడం మంచిది కాదు. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగింది. దానిని నేను ఒప్పుకుంటా. కాని పలానా మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అని నేను ప్రశ్నిస్తున్నాను.. మనందరం ఎప్పుడో అప్పుడు చనిపోవాల్సిందే. వార్తలు రాసిన వ్యక్తులు కూడా చనిపోవాల్సిందే. అయితే మీ లింక్ ఓపెన్ చేయడానికి దారుణమైన కాప్షన్స్ పెట్టకండి. లేనిపోని వార్తలతో అందరిని మానసిక క్షోభకి గురి చేయకండి అని అప్పారావు కోరారు.
అప్పారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అప్పారావు బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆయన 1984 నుంచి నాటకాలు వేస్తూ వచ్చారు. ‘శుభవేళ’ అనే సినిమా తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వెళుతున్న అప్పారావుని..’షకలక శంకర్’ జబర్దస్త్ కామెడీ షోకి పరిచయం చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే షకలక శంకర్ కారణం అని అప్పారావు చెప్పుకొచ్చారు. జబర్ధస్త్ తనకి ఎంతో లైఫ్ ఇచ్చిందని అప్పారావు అన్నారు.