బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన కత్తి మహేష్ ఆ తర్వాత తన పాపులారిటీని ఉపయోగించుకుని రాజకీయ విషయాలపై తన స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. బేసిగ్గా.. ఆయన చేసే వ్యాఖ్యలు కులాలకూ, మతాలకూ వ్యతిరేఖంగా ఉండటం వల్ల.. నాస్తికత్వాన్ని సమర్తిస్తూ దేవుళ్ళపై కామెంట్స్ చేయడం వల్ల ఆయన్ని ద్వేషించే వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ పై కూడా కత్తి మహేష్ విమర్శలు చేయడంతో ఒక సమయంలో ఆయనకు ఎన్నో వార్నింగ్స్ వచ్చిన విషయం కూడా తెలిసిందే.
ఐతే, ఇప్పుడు ఆ కత్తి మహేష్ ఒక రోడ్డు ప్రమాదంలో విపరీతంగా గాయపడ్డారు. చెన్నై హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్న కత్తి మహేష్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల భారీ ఆర్థిక సహాయం అందజేసింది. ఇలా చేయడంపై చాలా మంది మండిపడుతున్నారు. రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఇలా చేసింది తప్ప.. ఒక సామాన్యుడు ఇలా గాయపడితే అతనికి ఇలాంటి సహాయం అస్సలు అందదని అంటున్నారు. అలాగే, రాముడి వంటి గొప్ప దేవుడిపై కూడా కామెంట్స్ చేసిన వాడిని వాడి ఖర్మ కింద వదిలేసి ఉండచ్చు కదా అని కూడా మండిపడుతున్నారు. ఇంకొందరు మరీ ఘాటుగా.. ఎవడబ్బ సొమ్మని అన్ని లక్షలు ఊరికే కార్యకర్తకి ఇచ్చేస్తారు.. అది ప్రజల సొమ్ము కదా అని అంటున్నారు.
Leave a comment