హీరో చూస్తే చాలా మొరటుగా కనిపిస్తాడు. హీరోయిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అలాంటి హీరో, హీరోయిన్ ని ఇష్టపడితే ఆ అమ్మాయి అతన్ని ఆక్సెప్ట్ చేస్తుందా.. అనే కథాంశంతో వచ్చిన సినిమాలా ఉంది పొగరు.
‘కండల్లో బలం ఉందని రౌడీయిజం చేయను. గుండెల్లో ధైర్యం ఉందని గూండాగిరీ చేయను. కానీ గిత్త సైలెంట్ గా ఉంది కదా అని కొమ్ము లాగితే.. గుద్దితే గూగుల్ లో వెతికినా ట్రీట్మెంట్ దొరకదు..’ అని చెప్పే హీరో ధృవ్ సర్జా… కేర్ లెస్ గా టపాకాయలు పేలుస్తుంటే సామాజిక బాధ్యతని గుర్తుచేసే హీరోయిన్ ని ప్రేమిస్తాడు. ‘అసలు నువ్వెలా ఉంటావో ఎప్పుడైనా గమనించావా..’ అని విముఖత వ్యక్తం చేసే ఆ అమ్మాయి అతని ప్రేమని చివరికి ఒప్పుకుంటుందా లేదా తెలియాలి అంటే ఈ వారాంతం దాకా ఆగాల్సిందే.
బీకే గంగాధర్ నిర్మించిన ఈ సినిమాని నంద కిషోర్ డైరెక్ట్ చేసాడు. మ్యూజిక్ అందించింది వి. హరికృష్ణ మరియు చందన శెట్టి. జూలై రెండు నుండి ‘ఆహా’ లో అందుబాటులో ఉండనుంది. కన్నడలో షూట్ చేసిన ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసారు.
Leave a comment