దియా మీర్జా
2000 సంవత్సరంలో మిస్ ఏసియా పసిఫిక్ అందాల పోటీలో విజేతగా నిలిచింది. తను పుట్టింది హైదరాబాద్ లోనే. కేవలం అందాల పోటీలోనే కాకుండా, బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ ప్రత్యక్షంగా తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. తనతో సినిమా చేయడానికి మన నిర్మాతలు ఆసక్తి చూపించకపోవడం కూడా ఒక కారణం అనేది టాక్.
జానీ లీవర్
చిన్న వయసులోనే ముంబై వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, స్టార్స్ ని ఇమిటేట్ చేయడం నేర్చుకున్న జానీ లీవర్ మెల్లగా స్టాండ్ అప్ కమెడియన్ గా ఎదిగి, తర్వాత బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు. జానీ లీవర్ ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టిన వ్యక్తి. హిందుస్థాన్ యూనీ లీవర్ లో పని చేయడం వల్ల ఆయనకి ‘లీవర్’ అనేది ఇంటి పేరుగా మారిపోయింది. నాగార్జున హీరోగా నటించిన ‘క్రిమినల్’ సినిమాలో తప్ప మరే తెలుగు సినిమాలో కూడా జానీ కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించిన కమెడియన్.
సాయి కుమార్
డబ్బింగ్ చెప్పడంలో కింగ్ గా మారిన సాయి కుమార్ తెలుగులో కన్నా కన్నడ చిత్ర పరిశ్రమ అయిన సాండల్ వుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు అంటే నమ్మలేం. నిజానికి ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయిన ‘పోలీస్ స్టోరీ’ సినిమాని కూడా ముందు కన్నాడలోనే తీశారు. తర్వాత అదే సినిమాని తెలుగులో డబ్ చేశారు. పెద్ద సంచలనం అయిపోయింది.
సమీరా రెడ్డి
తను రాజమండ్రిలో పుట్టిన తెలుగు అమ్మాయి. నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రజలకి పరిచయం ఐనా తను ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేసింది. అక్కడ పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి మన తెలుగు అమ్మాయే కావడం విశేషం.
విశాల్
తమిళ సినిమా సంఘానికి ఏకంగా అధ్యక్షుడు ఐపోయిన విశాల్ మన తెలుగు వాడే. ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి కొడుకు విశాల్. పందెం కోడి, భరణి వంటి సినిమాలని తెలుగులో డబ్ చేయడం జరిగింది. అవి సక్సెస్ అయ్యాయి. కానీ పూర్తి తెలుగు సినిమాగా వచ్చిన సెల్యూట్ మూవీ హిట్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత విశాల్ తన కెరీర్ ని తమిళ్ కే పరిమితం చేసాడు. అక్కడ విడుదలైన ఆ సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయి వస్తున్నాయి.
శ్రీరామ్
తమిళంలో ఇతను శ్రీకాంత్ గా తెలుసు. తెలుగులో 2003 లో ఒకరికి ఒకరు అనే సినిమా చేసాడు. అది మంచి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఈ హీరోకి పెద్దగా అవకాశాలు రాలేదు. అలా తమిళ సినిమాకి పరిమితం అయిపోయాడు.
పైడి జయరాజ్
పూర్తిగా తెలుగు వాడైన పైడి జయరాజ్ సినిమాల మీద ఇష్టంతో ముంబై వెళ్ళి అక్కడ షూటింగ్ లలో చిన్న చిన్న పనులు అన్నీ చేస్తూ.. పాత్రలు సంపాదించాడు. అలా అక్కడ మెల్లగా స్టార్ గా ఎదిగిపోయాడు పైడి జయరాజ్. ఆయన తెలుగువాదని చాలా మందికి తెలియదు.
వైభవ్ రెడ్డి
ఫేమస్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి. తెలుగులో ‘గొడవ’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చినా ఆ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత తమిళ సినిమాకి వెళ్ళిపోయాడు వైభవ్. అక్కడ మంచి సక్సెస్ చూస్తున్నాడు.
జీవా
జీవా కూడా తెలుగువాడే. అతని తండ్రి ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి. తమిళ సినిమాలో స్టార్ గా మారిన జీవా అక్కడ ఎన్నో హిట్స్ కొట్టాడు. రంగం సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయినప్పటికీ జీవా ప్రధానంగా తమిళ సినిమాపై ఆధార పడ్డ తెలుగు వాడు.
ఆది పినిశెట్టి
ఆది కూడా తెలుగువాడే. తెలుగులో తేజ దర్శకత్వంలో చేసిన ‘ఒక విచిత్రం’ పరవాలేదు అనిపించినా ఇండస్ట్రీ బ్రేక్ మాత్రం తమిళ్ లో దొరికింది. ఆ సినిమానే తెలుగులో డబ్ అయిన ‘వైశాలి’. తర్వాత ఆది తెలుగులో పెద్దగా నటించలేదు. చివరి సారిగా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యగా కనిపించిన ఆది ఈ పదేళ్ళ కాలంలో తెలుగులో చేసింది కేవలం మూడు సినిమాలే.
Leave a comment