Prabhas: బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఇమేజ్‌ని ఎవరు నిలబెట్టలేకపోయారు. బాహుబి తర్వాత ప్రభాస్ మూడు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే చేశాడు. ఆ మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. సాహో` పాయింట్ కాస్త బాగున్నా, దాన్ని ప్రజెంట్ చేయడంలో సుజీత్ ఫెయిలయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రేమ కథని, ఫాథాలజీని మేళవిస్తూ ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ చిత్రం చేశాడు రాధాకృష్ణ. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌పై పలు విమర్శలు వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక కథ పరంగా మెప్పించలేక ఫ్లాప్ అయింది.ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ చిత్రంలోను ప్రభాస్ లుక్ పై దారుణమైన ట్రోలింగ్ నడిచింది.
`బాహుబలి`లో యుద్ధ వీరుడిగా, రాజుగా అదరగొట్టిన ప్రభాస్ ఆ తర్వాత మాత్రం అంతగా అలరించలేకపోతున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌తో మేకర్స్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన విచిత్రంగా చూపిస్తూ సినిమాపై నెగెటివిటీని పెంచుతున్నారు. తాజాగా `ప్రాజెక్ట్ కే` విషయంలో కూడా ఆ డొల్లతనం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్‌తోనే అభిమానులని ఆశలను నీరుగార్చేసారు. ప్రభాస్ ఫస్ట్ లుక్‌లో ఓ ఐరన్ మ్యాన్ బాడీకి ప్రభాస్ తలని అంటించినట్టుగా ఆ పోస్టర్ ఉంది. సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆ విషయం అర్ధమవుతుంది. మరి అంత మంది టీంలో ఎవరికి ఇది కనిపించలేదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ `బ్లాక్ ఆడమ్, ఐరన్ మ్యాన్, ఆదిపురుష్ కలిని ప్రాజెక్ట్ కె పోస్టర్ డిజైన్ చేసినట్టుగా ఉందని కొందరు అంటున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగిన కూడా క్వాలిటీ లేకుండా ఇలా విమర్శల పాలయ్యేలా ఎందుకు సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ఒక్కడి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది. ప్రభాస్ కాని ,అతని టీం కాని వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కామిన్ కాన్‌లో వంటి వేడుకలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై టీం ఏమైన వివరణ ఇస్తుందా లేదా అనేది చూడాలి. చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటానీ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మహానటి ఫేం నాగ్ అశ్విన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.