Prabhudeva: ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులని కూడా ప్రభుదేవా ఎంతగానో అలరించాడు. కేవలం డ్యాన్స్‌తోనే కాక నటనతోను, డైరెక్షన్ తో కూడా అలరించాడు. ప్రభుదేవా తన తండ్రి సుందరం, సోదరుడు రాజు సుందరంతో కలిసి ఇండియన్ సినిమా డాన్స్ ట్రెండ్ ను సరికొత్త మార్గంలోకి తీసకెళ్లాడు.దర్శకుడు శంకర్ తీసిన ప్రేమికుడు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ గా మారి ఆ తర్వాత వరుసగా పలు విజయాలు అందుకున్నాడు ప్రభుదేవా. ఒకవైపు నటుడిగా, కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే, దర్శకుడిగా కూడా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు ప్రభుదేవా.
హిందీ, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. అయితే ప్రభుదేవా తన సహ-డ్యాన్సర్ అయిన రమలత్‌తో ప్రేమలో పడి 1995లో వివాహం చేసుకున్నాడు. వారి వైవాహిక జీవితంలో ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో విశాల్ దేవ 2008లో మరణించాడు. ఇక ప్రభుదేవా, రమలత్ 2011లో అనుకోని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రభు దేవా హిమానీ సింగ్అనే ఫిజియో థెరపిస్ట్ ని2020లో వివాహం చేసుకున్నాడు. కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీగా వారి పెళ్లి జరిగింది. వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన సమయంలో హిమానీతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడు హిమానీ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రభుదేవా స్వయంగా వెల్లడించారు. 50ఏళ్ల వయస్సులో నేను మరోసారి తండ్రిని అయ్యాను. ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన వ్యక్తిని అన్న ఫీలింగ్ కలుగుతోంది” అని ప్రభు దేవా స్పష్టం చేశారు. ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం తనపై ఉన్న పని భారాన్ని తగ్గించుకున్నట్టు తెలిపారు ప్రభుదేవా. ఫ్యామిలీ, కూతురుతో కలిసి ఎక్కువ సమయం గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ తనకు పరుగెత్తడమే సరిపోయిందని, ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని అంటున్నాడు.