1992 స్కామ్ వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ సంపాదించిన నటుడు ప్రతీక్ గాంధీ.. అందులో హర్షద్ మెహతాలా నటించి అందరినీ మెప్పించాడు. అతని నటన చూసిన తర్వాత.. అభిషేక్ బచ్చన్ హర్షద్ లా నటించిన బిగ్ బుల్ సినిమాని జనాలు ఎంజాయ్ చేయలేకపోయారు. అంతలా అతని నటన ఇంపాక్ట్ జనాల మీద పడింది. ఆ ఒక్క సిరీస్ తో స్టార్ హీరోల సరసన చేరిపోయిన ప్రతీక్ ని మరో ముఖ్యమైన బయోపిక్ కోసం పరిశీలిస్తున్నారట. ఆ బయోపిక్ మారెవరిదో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఇంతకు ముందు ‘యాత్ర’ పేరుతో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా మంది అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకుంది. సినిమా కోసం దర్శకుడిగా పనిచేసిన మహి రాఘవ మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. వైయస్ జీవితాన్ని బాగా స్టడీ చేసిన అతనికి జగన్ జీవితంపై కూడా మంచి అవగాహన ఉన్న నేపథ్యంలో.. జగన్ ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాలు, యాత్రలు అలాగే గడిపిన జైలు జీవితం.. వీటన్నిటినీ ఒక సినిమాగా చూపించే ప్రయత్నం కచ్చితంగా ఫలిస్తుందని అంటున్నారు. ఇందుకోసం.. ఇప్పటికే బయోపిక్ లు చేయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీనే ఈ పాత్ర చేసేందుకు పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.
జగన్ అభిమానులు కూడా.. జగన్ లా నటించడానికి ప్రతీక్ చక్కగా సరిపోతాడని భావిస్తున్నారు.
Leave a comment