Radhika Apte: ఏదైనా ముఖం మీద చెప్పేయడం.. ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్లు ఉంటుంది రాధిక ఆప్టే వ్యవహారం. తన బిహేవియర్ కారణంగా పలుసార్లు కాంట్రవర్సీల్లో నిలిచింది. పర్ఫార్మెన్స్ పరంగా ఆమెకి పేరు పెట్టలేం కానీ కాస్త తేడా మనిషి అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.
హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డిఫరెంట్ ఫిలింస్, ఛాలెంజింగ్ రోల్స్ చేసిన రాధిక ‘రక్తచరిత్ర’ తో తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాలు చేసింది.
గతంలో హాలీవుడ్లో స్టార్ట్ అయ్యి అన్ని ఇండస్ట్రీలనూ ఓ ఊపు ఊపిన క్యాస్టింగ్ కౌచ్ అంశం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది రాధిక. రీసెంట్ ఇంటర్వూలో తన కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు తనకిచ్చిన సలహాలు, కామెంట్స్ వంటి విషయాల గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
‘నేను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. చాలా మంది నిర్మాతలు నన్ను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని చెప్పారు. అలా చేయించుకుంటే మరింత అందంగా కనిపిస్తావనేవారు. చాలా ఫిలిం రిలేటెడ్ మీటింగ్స్‌లో బ్రెస్ట్ ఇంప్లాంట్స్, ముక్కుకి కూడా సర్జరీ చేయించుకో అని సలహా ఇచ్చేవారు. నేను నాలా ఉండడానికే ఇష్టపడతాను అంటూ ఎవరెన్ని సలహాలిచ్చినా, ఆఫర్స్ ఇచ్చినా రిజెక్ట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది రాధిక.
Leave a comment