బాహుబలి ద్వారా తన ఖ్యాతిని విపరీతంగా పెంచుకున్న రాజమౌళి ఇప్పుడు RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే, ఏదో పనిమీద ఈ మధ్య ఒక విమానాశ్రయంలో దిగిన రాజమౌళి ట్విట్టర్ వేదికగా తన బాధని వ్యక్తం చేసారు. జక్కన్న ట్వీట్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. చాలా మంది అవునంటూ ఆయన్ని సమర్తిస్తున్నారు కూడా. ఇలా సమస్యలపై స్పందించడమే కావాల్సింది అనుకునేలా చేసిన ఆ సంఘటన ఏంటో చూద్దాం.
రాజమౌళి ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడ వసతులు చూసి ఆయనకి మనస్తాపంగా అనిపించినట్లు ఉంది. ఎందుకంటే.. ఫామ్స్ ఫిల్ చేయాల్సిన చోట కనీసం టేబుల్స్ వసతి లేకపోవడం చాలా దారుణమనుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేసారు. విమానాశ్రయ యాజమాన్యం ఇలాంటి సమస్యలని చూసి వాటి పరిష్కారంగా టేబుల్స్ ని అరేంజ్ చేయడం చాలా చిన్న సర్వీస్ అని ఆయన గుర్తు చేసారు.
అలాగే.. ఇండియాకి వచ్చే విదేశీయుల దృష్టిలో ఇండియా గురించి తప్పుగా ఆలోచించేలా ఉన్న పరిస్థితులని గుర్తు చేస్తూ.. విమానాశ్రయంలో వీధి కుక్కలు తిరుగుతూ ఉండడాన్ని తప్పు బట్టారు. విదేశీయులు వాటిని చూస్తే పరిస్తితి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారు? దయచేసి ఒకసారి ఈ సమస్యల వైపు చూడండి. ధన్యవాదాలు అని స్పందించారు.
Leave a comment