బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి 2022లో త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అదే విధంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ బహుమతులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆలియా భట్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
త్రిబుల్ ఆర్ సినిమా కలక్షన్స్ విషయంలో కూడా భారీ రికార్డులను తిరగరాసింది. అదేవిధంగా ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనపై ఇప్పటికీ ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన సమయంలో వీరిద్దరి నటనపై ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హట్ చేశాడు.
రామ్ చరణ్- ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేది ఏది అంటే మీరు ఓపెన్‌గా చరణ్ అన్నారు అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా.. ఆ విషయానికి విజయేంద్ర ప్రసాద్ అలాంటిది ఏమీ ఉండదు అని అన్నాడు. యాంకర్ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో కాస్త తడబడుతూ ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు అలా ఏమనుకోలేదు.. అసలు ఒక పాత్రను తక్కువ చేయటం అనేది మాకు ఉండదు. అసలు అలా అనుకోం రాసేటప్పుడు మాకు రెండు పాత్రలు ఒకేలా అనిపించాయి.
ఒకేలా అనుకునే కథ రాశాం.. అయితే రామ్ చరణ్ పాత్రలో ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి.. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది… అయితే ఎన్టీఆర్ చేసిన బిమ్ పాత్ర చేయడం చాలా కష్టం.. ఈ కథను ముందుకు తీసుకు వెళ్ళటంలో సపోర్టింగ్ గా ఉంటుంది రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే.. చాలామంది రాముడు వచ్చాడని అనుకున్నారు మేం ఆ ఉద్దేశంతో తీయలేదు అంటూ చెప్పుకోచ్చారు. ఒక రైటర్‌గా తన అభిప్రాయం ఏంటో చెప్పారు విజయేంద్ర ప్రసాద్. కానీ ఈ వ్యాఖ్యలు చాలావరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు.
త్రిబుల్ ఆర్’లో ఎన్టీఆర్ పాత్ర గురించి, ఆయన నటన గురించి ఆయన గొప్పగానే మాట్లాడినా కూడా పాత్రల ప్రాముఖ్యత విషయంలో మాత్రం రామ్ చరణ్‌కే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.