ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా గత రెండేళ్లుగా మరో సినిమా ఏదీ చేయకుండా పూర్తిగా ఈ సినిమా మీదే ధ్యాస పెట్టిన విషయం మనకి తెలుసు. సినిమా నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలి అనుకునే సమయంలో కరోనా పాండెమిక్ వచ్చేసి పరిస్తితులని బాగా మార్చేసింది. ఆ తర్వాత ఎక్కడికీ వెళ్ళి షూటింగ్ చేయలేని పరిస్తితి. అంతా ఇళ్లకు పరిమితం అయ్యారు.
కానీ ఇప్పుడు పరిస్తితి కుడుటపడింది. సెకండ్ వేవ్ ఉదృతి తగ్గడంతో లాక్ డౌన్ నిబంధనలు కూడా సడలించడం వల్ల సినిమా నిర్మాతలు, దర్శకులు మధ్యలో ఆపేసిన వాళ్ళ షూటింగ్ లని కొనసాగించడానికి రెడీ అయ్యారు. ఐతే, చాలా వరకు షూటింగ్ లు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూ ఉంటాయి కాబట్టి.. చాలా సినిమాల వాళ్ళు తమ షూటింగ్ పణులకి అక్కడికే వెళ్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ వైపు మాత్రం చూడటం లేదు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది.
రాజమౌళి దర్శకుడిగా మాత్రమే కాకుండా.. తను చేస్తున్న సినిమాలో అన్ని విభాగాలనూ పరీక్షిస్తూ ఉంటాడు. తను చేస్తున్న సినిమాకి డబ్బులు పెడుతున్న నిర్మాతలకు నష్టం రాకుండా.. తన డైరెక్షన్ ని, లొకేషన్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా బాహుబలి సినిమాను.. అంతకు ముందు వచ్చిన చాలా వరకు ఆయన సినిమాలు ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరిపారు. కానీ, చాలా కాలంపాటి షూటింగ్ అనుభవం తర్వాత ఆయనకి అర్థమైన విషయం ఏమిటంటే రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు అక్కడ జరుపుతున్న షూటింగ్ లకి ఎక్కువగా డబ్బులు చార్జ్ చేయడం. ఈ విషయం రాజమౌళికి చాలా అసౌకర్యంగా అనిపించింది. అందుకే ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ వైపు చూడటం లేదనేది సమాచారం.
Leave a comment