Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలకి పాకేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా తీసి ఆ సినిమాలోని సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కేలా చేశాడు. రాజమౌళి ఏదైన సినిమా టేకాఫ్ చేశాడంటే అది హిట్ అవ్వాల్సిందే… బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయాలని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనుండగా, ఈ సినిమా కోసం రాజమౌళి ఎన్ని సంవత్సరాల సమయం తీసుకుంటాడో చెప్పడం కష్టమే. మహేష్ బాబు తర్వాత రాజమౌళి.. ఎన్టీఆర్, ప్రభాస్‌లతో మళ్లీ సినిమాలు చేయనున్నారని అంటున్నారు.
రాజమౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాటగా, ఆయన క్రేజ్‌ని ఉపయోగించుకునేందుకు పలు యాడ్ కంపెనీలు పోటిపడుతున్నాయి. ఇటీవల రాజమౌళి.. ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడం మనం చూశాం. తొలిసారిగా కమర్షియల్ యాడ్ లో నటించి వావ్ అనిపించాడు. సాదారణంగా రాజమౌళి చాలా సింపుల్ గా కనిపిస్తారు. కాని యాడ్ లో మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అబ్బురపరిచాడు. రాజమౌళి హీరోగా కూడా చేయవచ్చు అని పలువురు కామెంట్ చేశారు. ఒప్పో కొత్త మోడల్ రెనో 10 సిరీస్ ఫోన్ కోసం రాజమౌళి ఆ యాడ్ చేయగా, 45 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం రాజమౌళి రూ.3 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
రాజస్తాన్‌లో యాడ్ షూటింగ్ జరగగా, దీని కోసం కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లారు రాజమౌళి. రాజస్తాన్‌లో యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇక రాజమౌళి తన సినిమాల కోసం ఇప్పుడు దాదాపు రూ.150 కోట్లు పారితోషికం తీసుకుంటారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. మహేష్ సినిమా కోసం రాజమౌళి తన రెమ్యునరేషన్‌ని మరింత పెంచినట్టుగా టాక్. చిత్రాన్ని రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించనున్నారని, సినిమా క్లైమాక్స్ కూడా అందుకు సపోర్ట్ చేస్తోందని రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల బాలీవుడ్ మీడియాకు తెలిపారు.