Jeevitha Rajasekhar: ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ రోల్లో కనిపించి సందడి చేశారు రాజశేఖర్. ఆయన సతీమణి కూడా మంచి యాక్ట్రెస్ కాగా, పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చింది జీవిత. ఇప్పుడు రాజశేఖర్ అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ జీవిత మాత్రం వెండితెరపై కనిపించక చాలా రోజులే అయింది. వారి పిల్లలు మాత్రం కథానాయికగా నటిస్తూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజశేఖర్, జీవిత వివాదాలతో కూడా ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటారు.
తాజాగా పరువు నష్టం కేసులో రాజశేఖర్, జీవిత దంపతులకు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేసినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేయగా, దానిపై నాంపల్లి కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 5 వేల జరిమానా కూడా విధించింది. మీడియా సమావేశంలో వారు తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు.
రాజశేఖర్, జీవితల ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కూడా కోర్టుకు సమర్పించడంతో.. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై వారు జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో రూ.10 చొప్పున పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, రాజశేఖర్ దంపతులు గతంలో చాలా సార్లు చిరంజీవిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారు. కాని ఈ మధ్య ఆయనతో సన్నిహితంగానే మెలుగుతున్నారు.