చాలా కాలం క్రితం నుండే ఎప్పుడెప్పుడా అనుకుంటున్న అక్షయ్ కుమార్ కొత్త సినిమా ఈ రోజుతో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. డైరెక్టర్ ఆనంద్ రాయ్ ‘Atrangi Re’ సినిమా తర్వాత ఈ సినిమాని అక్షయ్ కుమార్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి తన సిస్టర్ ని గుర్తు చేసుకున్నాడు అక్షయ్ కుమార్. తన పేరు Alka. ఆమెతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించాలి అనుకుంటున్నట్లు, ఈ రోజుతో సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు ట్వీట్ చేసాడు.
ఐతే తెరమీద అక్షయ్ కుమార్ సిస్టర్స్ గా కనిపించబోతున్న వాళ్ళ ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సహెజ్మీన్ కౌర్మ్, దీపికా కన్నా, సదియా ఖతీబ్ మరియు స్మ్రితి శ్రీకాంత్ అక్షయ్ కుమార్ కి సిస్టర్స్ గా కనిపించబోతున్నారు. 2020 లో రక్షాబంధన్ రోజున అదే పేరుతో ఈ సినిమాని ప్రేక్షకులకి అందించబోతున్నట్లు ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా ఇంతకాలం షూటింగ్ పనులు మొదలుపెట్టలేకపోయింది. కరోనా పాండెమిక్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.
Leave a comment