Ram Charan: దాదాపు 11 ఏళ్లుగా రామ్ చరణ్, ఉపాసనలకి పుట్టబోయే బిడ్డ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు జూన్ 20న ఉపాసన పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తమ ఫ్యామిలీలోకి పండంటి ఆడబిడ్డ రావడంతో మెగా ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక జూన్ 30న మెగా వారసురాలికి నామకరణం చేయగా, ఆ రోజు ‘క్లీంకార’ అనే పేరు పెట్టారు. లలిత సహస్రనామంలో నుండి ఈ పేరు తీసుకున్నారని, ఆ పేరుని ఉపాసన తల్లి తన కూతురికి పెట్టాలని అనుకుందని కూడా చెప్పారు. అయితే జూలై 20తో క్లీంకారా జన్మించి నెల రోజులు అయింది. అలానే ఇదే రోజు ఉపాసన బర్త్ డే కావడంతో రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో హృదయానికి హత్తుకునే వీడియోని షేర్ చేశారు.
ఇందులో క్లీంకార ఆగమనంకి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు. వీడియాలో మెగాస్టార్ చిరు, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని వారి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. క్లీంకార పుట్టినప్పుడు అందరు ఎంత ఎగ్జయిట్ అయ్యారు, ఎంత ఆనందం పొందారనేది కూడా ఈ వీడియాలో మనం గమనించవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ స్వీట్స్ తినిపించుకున్నారు. రామ్ చరణ్‌కి బెస్ట్ విషెస్ అందించారు. వాటన్నింటినీ కూడా వీడియోలో చాలా అందంగా చూపించారు.
ఇక వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ ఏవె తెలియని టెన్షన్. అంతా మంచిగా జరగాలని మేం అందరూ ప్రార్థించాం. పాప పుట్టిన ఆ క్షణం నా మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని ఎంతో సంతోషంగా ఫీలయ్యాము అని రామ్ చరణ్ అన్నారు. ఇక క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో చూపించారు. చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమయ్యాయి అని ఉపాసన కోరింది.. ఇక ఓ ఫ్రేములో పాపని చూసి ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకుంది ఉపాసన.