Rambabu: ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారాడు. వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్ దారుణమైన కామెంట్స్ చేస్తుండగా, వాటిని వారు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్ర పెట్టి ఆయనని కించపరచడంతో ఇక అప్పటి నుండి అంబటి రాంబాబు ఛాన్స్ దొరకిన ప్రతి సారి పవన్ కళ్యాణ్‌పై ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. రాజకీయంగా తన మద్ధతు పవన్‌కేనని, పవన్ డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదలకు మంచి చేయాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారని రేణూ దేశాయ్ పేర్కొంది.
ప్రజలకి మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని సైతం పక్కనబెట్టారని ఆమె ప్రశంసించారు. ఆయన మూడు పెళ్లిళ్లపై చర్చలు ఆపాలని, పిల్లలను, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. నా పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలను కూడా రాజకీయాలలోకి లాగొద్దని రేణూ దేశాయ్ కోరారు. అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ కొన్నాళ్లుగా వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు హట్ టాపిక్ అయింది. అయితే ఎప్పుడైతే రేణూదేశాయ్ వీడియో పోస్ట్ చేసిందో.. వెంటనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు రేణూ దేశాయ్‌పై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
రేణూ దేశాయ్.. వీడియో పోస్ట్ చేసిన తర్వాత అంబటి రాంబాబు స్పందిస్తూ.. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని! ” అని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రీసెంట్గా నటించిన బ్రో సినిమాలో తన పాత్ర ఎందుకు పెట్టారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తాజా ట్వీట్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికి పవన్ పెళ్లిళ్లపై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రేణూ దేశాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు జనసైనికులకి కాస్త బూస్టప్ ఇచ్చినట్టు అయింది.