Shamshera Teaser : అంచనాలు పెంచుతున్న ‘షంషేరా’ టీజర్ - Filmylooks Ranbir Kapoor Shamshera Teaser
Home Film News Shamshera Teaser : అంచనాలు పెంచుతున్న ‘షంషేరా’ టీజర్
Film News

Shamshera Teaser : అంచనాలు పెంచుతున్న ‘షంషేరా’ టీజర్

Shamshera Teaser
Shamshera Teaser

Shamshera Teaser: బాలీవుడ్ యంగ్‌స్టర్ రణ్‌బీర్ కపూర్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వాణీ కపూర్ మెయిన్ లీడ్స్‌గా.. ‘అగ్నిపథ్’ ఫేమ్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మూవీ ‘షంషేరా’.

హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల చెయ్యనున్నారు. ‘షంషేరా’ టైటిల్‌కి ‘‘కర్మ వల్ల దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం’’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ పెట్టారు. సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘షంషేరా’ టీజర్ విడుదల చేశారు.

టీజర్ చూస్తే సినిమా విజువల్ వండర్‌గా ఆడియన్స్‌కి కొత్త అనుభవాన్నివ్వనుందనిపిస్తుంది. చారిత్రలో రెండు రాజ్యాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం నేపథ్యంలో ‘షంషేరా’ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. రణ్‌బీర్, సంజయ్ దత్ గెటప్స్, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ‘షంషేరా’ జూలై 22న హిందీ, తెలుగు, తమిళ్‌ లాంగ్వేజెస్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...