Rashmika: నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకున్న రష్మిక ఇప్పుడు అవకాశాల కోసం నానా ఇబ్బందులు పడుతుంది.. ఇటీవల నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి సంబంధించొ అనౌన్స్మెంట్ రాగా, ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అందరు అనుకున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ కావడంతో మూవీపై అనౌన్సమెంట్ వచ్చిన సమయంలోనే మంచి హైప్ వచ్చింది. ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేయడంతో ఈ చిత్రం డిఫరెంట్ జానర్‌తో తెరకెక్కుతుందని అందరు భావించారు.
అయితే ఇప్పుడు ఊహించని విధంగా నితిన్, వెంకీ కుడుముల చిత్రం నుంచి తప్పుకుంది రష్మిక. కొద్ది రోజుల క్రితం రష్మికకి తన మాజీ మేనేజర్ కిరణ్ తో వివాదం జరగగా, ఈ మూవీ నుండి తప్పుకోవడానికి అతనే కారణమని అందరు అనుకున్నారు. అయితే మరో ప్రచారం ఏం జరిగింది అంటే.. రష్మిక బాలీవుడ్ చిత్రాలకి ప్రధాన ఇవ్వడం వల్ల నితిన్ చిత్రం కోల్పోయింది అని అన్నారు. రష్మికకి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. నితిన్ చిత్రానికి డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ మూవీని రష్మిక పక్కన పెట్టేసింది. ప్రతి హీరోయిన్ బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నిస్తుండగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది హీరోయిన్లలో సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ.
ప్రస్తుతం రష్మిక కి కూడా బాలీవుడ్ ఏమాత్రం కలసి రావడం లేదు. ఇప్పటి వరకు రష్మికకి బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ షాహిద్ కపూర్ మూవీ కోసం నితిన్ మూవీ ని పక్కన పెట్టేసింది. అయితే ఆ మూవీ కూడా ఇప్పుడు అటకెక్కడంతో ఇప్పుడు నితిన్ సినిమా పోయింది, షాహిద్ సినిమా పోయింది. ఈ క్రమంలో అత్యాశకు పోయిన రష్మికకి భంగపాటు తప్పలేదు అంటూ నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ఒకే ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2 కాగా, ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకుంది.