Rashmika Married: నేషనల్ క్రష్‌గా అభిమానులతో పిలిపించుకుంటున్న రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మంచి హిట్స్ అందుకున్న రష్మికకి హిందీలో అంత సక్సెస్ రాలేదు. కన్నడ మూవీ ‘కిరాక్ పార్టీ’ మూవీతో సినీ పరిశ్రమకి పరిచయం అయిన రష్మిక.. తెలుగులో ‘ఛలో’ చిత్రంతో పరిచయం అయింది.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. రష్మిక నటించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది
ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప-2’లో హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే చిత్రం కూడా చేస్తుంది. ‘రెయిన్ బో’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ రష్మికనే కథానాయికగా నటిస్తుంది. అలానే నితిన్ సరసన కూడా ఓ చిత్రం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ వ్యవహారం గురించి కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం నడుస్తుంది. వారి రిలేషన్ గురించి మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి అడిగినా, సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నరు.
అయితే విజయ్, రష్మిక సోషల్ మీడియాలో చేసే పోస్టులు మాత్రం ఈ ఇద్దరు ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక, తన పెళ్లి గురించి ఎవరూ ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు తన మనసులో విజయ్ దేవరకొండ ఉన్నాడని అందరూ అనుకుంటుండగా, ఇప్పుడు వేరే వ్యక్తితో తనకు పెళ్లి అయిపోయిందంటూ పేద్ద బాంబు పేల్చింది. రీసెంట్గా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ఈవెంట్ లో పాల్గొన్న రష్మికకి పెళ్లి గురించి ప్రస్తావించింది. ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అని ప్రశ్న వేయగా, దానికి స్పందించిన రష్మిక తనకు ఇప్పటికే తనకు నరుటోతో పెళ్లి అయిపోయిందని , తన మనసు నిండా అతడే ఉన్నట్లు వెల్లడించింది. మరి ఈ నరుటో ఎవరనే కదా మీ డౌట్.. ఫేమస్ జపాన్ సిరీస్ లోని ప్రధాన పాత్ర పేరు .ఈ పాత్రకు ఎంతో మంది అభిమానులు ఉండగా, రష్మిక కూడా అందులో ఒకరు. మొత్తానికి రష్మిక చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.