Home Film News ‘ఈగల్’ మూవీ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టిన‌ట్టెనా..!
Film NewsReviews

‘ఈగల్’ మూవీ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టిన‌ట్టెనా..!

టైటిల్‌: ‘ఈగల్’
విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024
నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: డావ్ జాన్డ్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని

FL ప‌రిచ‌యం :
మ‌స్ మ‌హ‌రాజ్‌ రవితేజ హిట్‌, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. గతేడాది కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అది పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈగల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా హిట్ అవుతుంద‌ని మొదటి నుంచి మూవీ యూనిట్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈగల్ సినిమాతో రవితేజ మరోసారి భారీ విజయం అందుకున్నాడా..? దర్శకుడు కార్తీక్ ఘట్టమనే ఇండస్ట్రీలో ఇక దర్శకుడుగా సెటిలైపోయినట్టేనా? అనే విషయాలు ఈ రివ్యూ లో చూద్దాం.

Eagle Movie First Review : 'ఈగల్' మూవీ మొట్టమొదటి రివ్యూ..చివరి 30 నిమిషాలు రవితేజ కెరీర్ బెస్ట్!

కథ:
సహదేవ్ (రవితేజ) చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో ఒక గిరిజన ప్రాంతంలో ఫాం హౌస్ కట్టుకుని ఒక పత్తి ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. అక్కడ పండే అరుదైన పత్తిని రైతులు తీసుకొచ్చి ఇదే ఫ్యాక్టరీలో నేయడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ ఫ్యాక్టరీ ఉన్న గ్రామంలో బాక్సైట్ గనులు ఉన్నాయని తెలిసి ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు ఓ బ‌డ‌ వ్యాపారవేత్త కన్ను దానిపై పడుతుంది. ఎలాగైనా సహదేవ్ ను.. అక్కడ ఉన్న‌ రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని చెరబట్టాలని చూస్తాడు. కానీ అక్క‌డ పైకీ మామూలు వ్యక్తిలా కనిపించే సహదేవ్ వెనుక వేరే కథ ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో రూపం కూడా ఉంది. ఆ కథేంటి.. ఆ రూపమేంటి.. తనను చంప‌ల‌న్నీ వచ్చిన వాళ్లను సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఇక ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న క‌థ బావుంది. అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే డైలాగులను గాని, సాంగ్స్ గాని డిజైన్ చేయించుకున్న విధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు రవితేజను హీరోగా ఎంచుకొని దర్శకుడు ఒక మంచి పని చేశాడు. అయితే దర్శకుడు ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ పార్ట్ ని నమ్ముకుని ముందుకు వెళ్లాడు. స్టోరీ పరంగా అక్కడక్కడా కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ రవితేజ తన యాక్టింగ్ తో ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి గ్యాప్ కనిపియకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు.

Eagle' teaser: Ravi Teja is an unstoppable force in this action-entertainer - The Hindu

ఇక కొన్ని సీన్లలో అయితే రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న బలమైన సీన్లకి తన యాక్టింగ్ ద్వారా రవితేజ ప్రాణం పోశాడు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని రవితేజ కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు. ఇక ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటి అనేది తెలుస్తుంది. సినిమాల్లో ఉన్న‌ ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ తాలూకు డిజైనింగ్ అనేది ఎంతో క్లారిటీ గా ఉంది. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాలో విజువల్స్ ని కూడా ఎంతో రీచ్‌గా చూపించాడు.. మహి బాబు కరణం రాసిన డైలాగులు కూడా సినిమాను బాగా ఏలివెట్ చేశాయి. క‌థ‌కు ఏ టైం లో ఎలాంటి డైలాగ్ పడలో అలాంటి డైలాగ్స్ రాసి సక్సెస్ అయ్యాడు.

నటీనటులు:
రవితేజ గురించి చెప్పేదేముంది.. కారెక్టర్ ఏదైనా అందులో దూరిపోతాడు. ఈగల్ పాత్రను అలాగే చేసాడు రవితేజ. ఇక నవదీప్‌కు నేనేరాజు నేనేమంత్రి తర్వాత మంచి పాత్ర పడింది. అనుపమ పరమేశ్వరన్ కారెక్టర్ కథను ముందుకు నడిపిస్తుంది. కావ్య తపర్, వినయ్ రాయ్ పాత్రలు చిన్నవే అయినా.. బాగా చేసారు. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, మిర్చి కిరణ్‌ కామెడీ పర్లేదు. మిగిలిన వాళ్లు ఓకే..

Eagle trailer released: Ravi Teja plays a wanted man on a mission - Hindustan Times

సాంకేతిక వర్గం :
సాంకేతికింగా ఈగల్ మూవీ గుడ్. కార్తీక్ ఘట్టమనేని గ‌తంలో సినిమాటోగ్రఫర్ గనుక అదరగొట్టేశాడు. ఇక దావ్జాండ్ సంగీతం జస్ట్ ఓకే అనిపించినా.., బిజీఎమ్ విషయంలో మాత్రం అధ‌ర‌గోట్ట‌డు. ఇక ఇది కూడా అక్కడక్కడ మాత్రమే. ఎడిటింగ్ మాత్రం ఈ మూవీకి పెద్ద‌ డిజాస్టర్. ఇందులో కూడా కార్తీక్ ఘట్టమనేనిది మెయిన్ హ్యాండ్ కాబట్టి.. ఇది కూడా అతని ఫెయిల్యూర్ అవుద్ది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాల రీచ్‌గా ఉన్నాయి. కథా, కథనంలో విఫలం అయిన కార్తీక్ ఘట్టమనేని మేకర్ గా మాత్రం అదరగొట్టాడు. కానీ.., వీక్ క‌థ‌నం కారణంగా ఆ కష్టానికి త‌గిన‌ ఫలితం లేకుండా పోయింది.

ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన
దర్శకత్వం
యాక్షన్ సీక్వెన్స్
క్లైమాక్స్
బీజీఎం

మైనస్ పాయింట్స్ :
ఫస్టాప్ లో కథనం కాస్త స్లోగా సాగడం
కావ్య థాపర్ నిడివి తక్కువగా ఉండటం

article_image8

చివరగా :
ఈగల్‌ అంటూ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాతో రవితేజ తన నటన మరియు యాక్షన్ సన్నివేశాలు అలాగే తన పాత్ర తాలకు ఎలివేషన్ ఎమోషన్స్ ఎంతో బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఎంతో బాగుంది. అయితే ఈ సినిమాలో బలమైన ఎమోషన్ చూపించడంలో కొంత దర్శకుడు ఫేల్ అయ్యాడనే చెప్పాలి.ఎమోషనల్ గా ఈ సినిమాని ప్రేక్షకుడు అంతగా ఇన్వాల్వ్ చేసుకోలేడు.. ఎమోష‌న్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంటే ఈ సినిమా మారో స్థాయిలో ఉండేది. మొత్తంగా రవితేజ తన నటనతో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పాలి.

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే FL రేటింగ్- 2.5/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...