Ravi Teja: స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి కెరీర్ మొదట్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషించి ఆ తర్వాత హీరోగా మారాడు రవితేజ. ఇటీవల వరుస సినిమాలు లైన్‌లో పెడుతున్న రవితేజ ప్రేక్షకులకి నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నాడు. చివరిగా వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో రెండు సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
రానున్న రోజులలో రవితేజ ప్రేక్షకులకి మంచి వినోదం పంచనున్నాడని అందరు భావిస్తున్న సమయంలో ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..రవితేజ మరో మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో హీరోగా చేస్తారని., ఆ తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్ట బోతున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇప్పటికే రవితేజ పలు ఇంటర్వ్యూలలో తనకు దర్శకత్వం చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో హీరోగా సినిమాలు మానేసి దర్శకత్వం చేస్తానని కూడా చెప్పుకొచ్చారు
రవితేజ దర్శకత్వ రంగంలోకి అడుగుపెడితే ఆయన కచ్చితంగా హీరోగా సినిమాలు చేయడం మానేస్తానని అన్నాడు. మరి రవితేజ ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక రవితేజ తన కెరీర్‌లో పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేయడం మనకు తెలిసిందే. కాగా, రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలు చేసినప్పటికీ రవితేజ కి మాత్రం మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ఇడియట్ అని చెప్పాలి. ఈ చిత్రంతోనే రవితేజ మాస్ మహరాజాగా మారాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన సినిమా విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ రావడం ఖాయం.