పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. ఈ స్థాయిలో స్టార్ డం ని సంపాదించుకున్న ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళలోనే పవన్ కి ఆ రేంజ్ లో ఫాన్స్ ఉన్నారు. అంతలా తన ఫాలోయింగ్ ని పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కేవలం చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేకపోయినా.. తన సత్తా ఏంటో ఎప్పుడూ చూపుతూనే ఉన్నారు. ఆయన సినిమా అనౌన్స్ చేశారు అంటే చాలు ఫాన్స్ పిచ్చెక్కిపోతూ ఉంటారు. మామూలు టైమ్ లో చాలా సాధారణంగా కనిపించే పవర్ స్టార్ స్క్రీన్ ముందు తన బెస్ట్ చూయిస్తారు. ఆయన పర్ఫార్మెన్స్, ఫైట్లు, డాన్స్ అన్నీ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.
కానీ, ఇవన్నీ ఆయన అభిమానులకే. చాలా మంది ఆయనకి పెద్దగా ఫాన్స్ అవని వాళ్ళకి ఈ మూవీస్ అంత ఆసక్తిగా అనిపించవు కూడా. కెరీర్ మొదట్లో ఒక సాధారణ సపోర్ట్ ఉన్న కుర్రాడిగా పరిశ్రమలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో అడుగు పెట్టి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పటికే పెద్ద స్టార్ గా ఉన్న చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ ని కూడా మెల్లగా అభినందించటం మొదలెట్టారు. 1996 లో మొదలైన ఆ మూవీ.. చాలా మంది ప్రశంసలని అందుకుంది. అప్పట్లో మంచి సినిమాలు తీస్తూ వస్తున్న ఈవీవీ సత్యనారాయణ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
అలా మొదటి సినిమాతో వచ్చిన టాక్ పవన్ ని కొద్ది టైమ్ లోనే స్టార్ ని చేసేసింది. ఐతే పవన్ కళ్యాణ్ కి వచ్చిన స్టార్ డం అంతా ఆయన తొలి రోజుల్లో తీసిన తీసిన తొలి సినిమాల ద్వారా వచ్చిందే. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమా సక్సెస్ అవడం. తర్వాత గోకులంలో సీత సినిమా చేయడం అది కూడా సక్సెస్ అవడం జరిగింది. ఆ తర్వాత, పవన్ సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ వంటి సినిమాలు చేశాడు. ఈ మూవీస్ అన్నీ కూడా భారీ విజయాలని అందుకున్నాయి. 1996 లో తన జర్నీ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఇలా వరుస హిట్లతో 2001 వరకు పెద్ద స్టార్ గా కన్సిడర్ చేయబడ్డారు.
ఈ టైమ్ లో ఆయన చేసినవి కేవలం 7 సినిమాలే అవన్నీ మంచి గుర్తింపు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కి ఇప్పటిదాకా స్టార్ డం ని కొనసాగించేలా చేసింది. ఆ మూవీస్ తర్వాత పవన్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినా.. ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎక్కడికీ పోలేదు. పవన్ ని అలా ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ పీరియడ్ తర్వాత పవన్ కి పెద్దగా హిట్లే లేకపోవడం చాలా ఆశ్చర్యం అయినా.. ఆయన చేసిన సినిమాలకి అభిమానులు పోటెత్తుతూనే ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన రోజుల ఆయన పడిన కష్టం.. ఒక జీవితకాలం పాటు స్టార్ డం ని ఎంజాయ్ చేసేలా చేసింది. కేవలం ఈ ఫాన్స్ క్రేజ్ తోనే ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా యాదృచ్ఛికం కాదు. ఇక్కడ కూడా స్వతహాగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, పార్టీ తరపున ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచినా పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ మాత్రం తగ్గలేదు. వాళ్ళలా అభిమానిస్తూనే ఉంటారు. అంతే పవన్ కళ్యాణ్ అంటే!
Leave a comment