‘మా’ ఎన్నికల సంధర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్విటర్ లో తన అభిప్రాయాలని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడాడు. ‘ప్రకాష్ రాజ్’ ని సమర్తిస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘ఆ స్థానంలో ఎవరున్నా నేను అలాగే స్పందించేవాడిని.. నిజానికి నాకు ప్రకాశ్ రాజ్ తో పెద్దగా సంబంధమే లేదు. రెండేళ్లకి ఒకసారి అలా కలుస్తూ ఉంటాం..’ అని చెప్పాడు.
ఆ తర్వాత యాంకర్ స్వప్న కరోనాకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అందుకు గల కారణం.. ఆయన వైరస్ లకి ఎవరికీ అర్థం కాని పేర్లు పెడతారని.. అందరికీ అర్థమయ్యేలా ఉండే పేర్లు పెడితే ఎవరికైనా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది అనే సంధర్భంలో ఫన్నీగా అలా ట్వీట్ చేసినట్టు చెప్పాడు వర్మ. ఇదే టాపిక్ పై మాట్లాడుతూ యాంకర్ కరోనా పట్ల మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి అని అడిగినపుడు.. కరోనా గురించి నేను అసలు భయపడటం లేదని, ఒకవేళ నిజంగా ముంచుకొచ్చే పరిస్తితి వస్తే.. దానికి భయపడటం అనవసరం అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.
ఇదే సంధర్భంలో ఒక ఉదాహరణ ఇచ్చాడు. తను చూసిన ఒక వీడియోలో సునామీ వస్తుంటే అందరూ పరుగెత్తుతున్నారని.. కేవలం ఒకే ఒక్కడు వెనక్కి తిరిగి ముంచుకొస్తున్న అలని చూస్తున్నాడని నేను పక్క ఆ టైప్ అని చెప్పాడు. ఇందుకు వివరణ కూడా ఇచ్చాడు వర్మ. నిజంగా మనం ఏమీ చేయలేమని మనకి తెలిసినపుడు భయపడి పారిపోవడంలో ఎలాంటి అర్థం లేదని, ఆ చివరి క్షణాలని కూడా పూర్తిగా ఆస్వాదించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అందుకే ఒకవేళ న్యూక్లియర్ వార్ లాంటిదేదైనా జరిగితే.. ఆ న్యూక్లియర్ బాంబ్ ని చాలా దగ్గరగా నిలబడి చూడాలనుకుంటానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ఇంత ప్రత్యేకంగా ఆలోచించడం అరుదని మరోసారి నిరూపించాడు.
Leave a comment