ప్రస్తుతం ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న మోస్ట్ యాక్షన్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా సలార్.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మాస్ రోల్ ని ఈ సినిమాలో చేయగా సలార్‌గా ప్రభాస్ చేసే విధ్వంసాన్ని ఎంతో ఆసక్తితో చూసేందుకు ఇండియన్ సినీ అభిమానులు కాచుకొని కూర్చున్నారు.
ఇక ఈ సినిమా రెండో ట్రైలర్ వచ్చిన తర్వాత సలార్ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో యు ఎస్ మార్కెట్ ను సలార్ షేక్ చేస్తుంది. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందుగానే కేవలం ప్రీమియర్స్ తోనే రెండు మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. దీనిబట్టి యూఎస్ మార్కెట్లో సలార్ హవా ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థమవుతుంది.
తొలిరోజు పూర్తి అయ్యేసరికి సలార్ యూఎస్ మార్కెట్లో నాలుగు మిలియన్ డాలర్ల కలెక్షన్లు క్రాస్ చేసిన ఆశ్చర్య పోకర్లేదని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రవి బ్రసూర్ సంగీతం అందించిగా.. ఈరోజు అర్ధరాత్రి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో సలార్ హంగామా మొదలుకానుంది.