Samantha: సెప్టెంబర్ మొదటి వారంలో విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వారిద్దరికి చాలా ముఖ్యం కాగా, గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్తో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సమంత చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చొక్కా విప్పిన విజయ్ దేవరకొండ సమంతని ఎత్తుకొని గాలిలో తిప్పుతూ నానా హంగామా చేశాడు. వారి రచ్చ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అంతేకాదు ఇదేదో వెడ్డింగ్ ఫొటో షూట్ మాదిరిగా ఉందని కొందరు ట్రోల్ కూడా చేశారు.
అయితే సమంత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెబుతూ.. సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. విజయ్ కు కాబోయే భార్య చాలా సింపుల్ గా ఉండాలి.. అతని కుటుంబంలో కలిసి పోవాలి.. వారిలో ఒకరిగా ఉండాలి. అదే విజయ్ కూడా కోరుకుంటున్నాడు అని సమంత చెప్పింది. సమంత కామెంట్స్ కు విజయ్ కూడా అవును నిజమే అని తల ఊపాడు. అదే కాకుండా విజయ్ ఫోన్ తక్కువ మాట్లాడతాడని.. ఎక్కువ మెసేజ్ లు చేస్తాడని పేర్కొంది సమంత. విజయ్ కు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ.. గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడని పేర్కొంది సమంత.
ఇక విజయ్ కూడా సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, చిన్మయి, నీరజ కోన, మేఘన ఇలా సమంత కు కొంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియజేశాడు.. అంతే కాదు సమంతకు రకరకాల వంటలు ఆస్వాదించడమంటే చాలా ఇష్టం అని, ఏ విషయంలో అయినా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కోపం వచ్చినా అసభ్యంగా మాట్లాడదు అంటూ.. సమంత గురించి విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.