Samantha Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ సమంత.ఈ అమ్మడు ఆ మధ్య అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. సమంత నటించిన `యశోద` చిత్రం కాస్త పర్వాలేదనిపించింది. కానీ `శాకుంతలం` మాత్రం అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇది సమంతకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అయితే శాకుంతలం అంత దారుణంగా ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు భారీ ఆఫర్సే వస్తున్నాయి. ప్రస్తుతం సమంత తెలుగులో `ఖుషీ` చిత్రం చేస్తుంది. హిందీలో హాలీవుడ్ రీమేక్ `సిటాడెల్` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఇటీవల విదేశాలకి కూడా వెళ్లొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
సిటాడెల్ వెబ్ సిరీస్‌కి సమంత అందుకున్న పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఈ ఒక్క వెబ్ సిరీస్కిగానూ సమంత ఏకంగా పది కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తన కెరీర్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోలేదట. మేకర్స్ అంత భారీ మొత్తం ఆఫర్ చేశారు కాబట్టే సమంత ఇందులో నటించేందుకు ఒప్పుకుందట.ఈ వెబ్ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించేందుకు సిద్ధపడిందని అంటున్నారు. ఈ వార్త కనుక నిజమైతే సౌత్‌లో ఇంతటి పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్గా రికార్డుల్లోకి ఎక్కుతుంది.
సమంత చివరిగా `ది ఫ్యామిలీ మ్యాన్ 2` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో రాజీ అనే పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి అదుర్స్ అనిపించింది. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తోనే నార్త్ ఆడియెన్స్ కి చాలా దగ్గరయ్యింది. సమంతకి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఈ వెబ్ సిరీస్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. త్వరలోనే ఆమె ఓ హాలీవుడ్ మూవీలో కూడా నటించబోతుంది. ఈ చిత్రంతో సమంత రేంజ్ మరో లెవల్‌కి వెళుతుంది. పర్సనల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్ అయిన ప్రోఫెషనల్ లైఫ్‌లో దూసుకుపోతుంది సమంత.