సంజనా గల్రాని బుజ్జిగాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలతో తెలుగు వాళ్ళకి బాగా పరిచయమున్న నటి. ఆమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా బాగా నటించింది. ఐతే ఇప్పుడు తన మెడ వెనక భాగంలో ఉన్న టాటూని చాలాకాలం క్రితమే వేయించుకున్నా.. ఇంతవరకూ రివీల్ చేయకపోవడం వెనక ఉన్న కథని చెప్పుకొచ్చింది.
సినిమాలు బాగా ఆడుతూ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సంధర్భంలో తనతో ఏ అబ్బాయి కనిపించినా వాళ్ళతో ఎఫైర్ ఉన్నట్టు.. వాళ్ళు నా బాయ్ ఫ్రెండ్ అని తెలియడం కోసమే వాళ్ళతో కలిసి బయటికి వస్తునట్లు పుకార్లు వచ్చేవని, వాటిని భరించటం చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే.. ఒకసారి నా బ్రదర్ తో బయటికి రావడాన్ని కూడా మీడియా.. బాయ్ ఫ్రెండ్ అని చెప్పే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చింది. ఇలా చేయడం వల్ల తనలో తాను చాలా బాధ పడేదానినని, నేనొక భాదితురాలినని చెప్పింది. ఈ కారణాల వల్లనే తన టాటూని ఇంతకాలం రివీల్ చేయలేదని కూడా చెప్పింది. ఒకవేళ రివీల్ చేస్తే దాని వెనక ఎన్ని కథలు అల్లుతారో అని భయపడినట్లు రాసింది.
చివరగా.. ఆ టాటూలో ఉన్న పేరు మరెవరిదో కాదు ఒక సంవత్సరం క్రితం తొందర తొందరగా పెళ్లి చేసుకున్న తన భర్త ‘అజీజ్’ ది అని చెప్పింది. ఇప్పుడు తామిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు కాబట్టి ఇక ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు కాబట్టే ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్లు చెప్పింది. ఇలా తనకి చాలా కాలం తర్వాత ఈ టాటూకి సంబంధించిన స్టోరీని రివీల చేసే ధైర్యం వచ్చింది అన్నమాట. తన భర్త అజీజ్.. గత పదిహేనేళ్లుగా ఒక మంచి ఫ్రెండ్ గా, లవర్ గా, భర్తగా, ఒక తండ్రి లాంటి సలహాదారుగా ఉన్నందుకు అతని మీద ఉన్న ప్రేమని వలకబోసింది.
Leave a comment