Saravanan: ప్రముఖ వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్, ‘ది లెజెండ్’ మూవీతో హీరోగా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడుకి చెందిన శరవణన్ ఫస్ట్ సినిమాతోనే తనని తాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు.

అప్పటివరకు శరవణ స్టోర్స్ యాడ్స్‌లో పలువురు హీరోయిన్లతో కలిసి నటించిన శరవణన్.. 51 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటే అంతా షాకయ్యారు. ‘ది లెజెండ్’ మూవీ అనేది ఒకటి వస్తుందని తెలిసినప్పటినుండి మీమ్స్ రాయుళ్లకి, ట్రోలర్స్‌కి మాంచి ఫీడ్ దొరికినట్టయ్యింది. దీనికి మెయిన్ రీజన్ శరవణన్ లుక్స్.. ఓవర్ మేకప్, హెయిర్ స్టైల్.. ఇలా ఒకటేంటి.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నింటినీ ఓ రేంజ్‌లో ట్రోల్ చేసి పడేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడిన ఏకైక వ్యక్తి బహుశా ఈయనేనేమో. ‘పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి ఉంటారు.. టైం దొరికితే కన్నడ, మలయాళంలో కూడా మాట్లాడేవారేమో’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.


శరవణన్‌కి తనని తాను స్క్రీన్ మీద చూసుకోవాలని కోరిక. తానే నిర్మాతగా మారి, తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్స్, హెవీ స్టార్ కాస్ట్, ఫారిన్ లొకేషన్స్, సీజీ వర్క్ ఇలా భారీ హంగులతో.. దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ‘ది లెజెండ్’ అనే సినిమా చేశారు. బడ్జెట్ 80 కోట్లు అనే మాట కూడా వినిపిస్తోంది.
జూలై 28న ‘ది లెజెండ్’ వరల్డ్ వైడ్ 2500 స్క్రీన్స్‌లో రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టే మిక్స్డ్ టాక్ వచ్చింది. తెరమీద శరవణన్‌ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి ప్రేక్షకులది.. ఇక ‘డబ్బు విషయంలో టెన్షన్ లేదు, నేను హీరోగా కనిపించాలంతే’.. అంటున్న శరవణన్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ తిరిగొచ్చే అవకాశం లేకపోయినా.. దాదాపు 100 కోట్లకు పైగానే లాభం పొందారట..

ఎలాగయ్యా అంటే.. శరవణ స్టోర్స్, డ్రెస్సెస్‌తో పాటు గోల్డ్ బిజినెస్‌లో కూడా ఫేమస్.. తమిళ్, తెలుగు స్టేట్స్ మినహా పెద్దగా ఎవరికీ తెలియదు. అందుకే భారతదేశం మొత్తం తన స్టోర్స్‌ని విస్తరింపజెయ్యాలనుకున్నారు. దీనికి భారీ ఎత్తున ప్రమోషన్స్ చెయ్యాలి.. పైగా దసరా, దీపావళి లాంటి ఫెస్టివ్ సీజన్స్‌లో యాడ్స్ కోసం పాపులర్ సెలబ్రిటీస్‌ని తీసుకురావాలి..

ఒక్కో లాంగ్వేజ్‌కి ఒక్కో సూపర్ స్టార్ లేదా స్టార్ హీరోయిన్ అంటే బడ్జెట్ భారీగానే అవుతుంది.. ఇక్కడే వ్యాపారస్థుడిలా తన మొదడుకి పదనుపెట్టారు శరవణన్.. తమ బ్రాండ్ ఇండియా అంతటా రీచ్ అయ్యేలా పాన్ ఇండియా సినిమా చేసేశారు. సినిమాలో అన్నీ తమ బ్రాండ్ కాస్ట్యూమ్సే వాడారు.

సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. శరవణన్‌కి, శరవణ స్టోర్స్‌కి మంచి పబ్లిసిటీ దొరికింది. ఆయన గురించి చాలా మందికి తెలిసింది. ‘ది లెజెండ్’ మూవీకి ఆయన పెట్టిన బడ్జెట్ కంటే.. తన స్టోర్స్‌ని ఇండియా అంతటా విస్తరింపజెయ్యడానికి అయ్యే ప్రమోషన్స్ ఖర్చు కలిసొచ్చింది. ఈ లెక్కన చూస్తే.. పెట్టిన బడ్జెట్ రాకపోయినా దాదాపు 100 కోట్లకు పైగానే లాభం రాబట్టారు శరవణన్.. ‘అదే మరి కామన్ మెన్‌కి, బిజినెస్ మెన్‌కి తేడా’.. అంటూ అందరూ శరవణన్ గురించే మాట్లాడుకుంటున్నారు.
Leave a comment