Saravanan: సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చేవాళ్లుంటారు.. బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చేవాళ్లూ ఉంటారు.. బిజినెస్ ఫీల్డ్ నుండి సినిమా పరిశ్రమలోకి వచ్చేవాళ్లు మాత్రం చాలా రేర్‌గా ఉంటారు. శరవణ స్టోర్స్ ఓనర్, అరుల్ శరవణన్, లెజెండ్ శరవణన్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు.
శరవణ స్టోర్స్ అంటే తమిళనాడులో చాలా ఫేమస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రాంచెస్ ఉన్నాయి. లలిత జ్యువెలర్స్ ఓనర్‌లానే శరవణన్ స్టోర్స్‌కి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవారు శరవణన్. యాడ్స్‌లో పలువురు స్టార్ హీరోయిన్స్ ఆయనతో పాటు నటించారు.
శరవణన్‌కి తనని తాను స్క్రీన్ మీద చూసుకోవాలని కోరిక. తానే నిర్మాతగా మారి, తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ‘ది లెజెండ్’ అనే సినిమా చేశారు. ప్రోమోస్, ప్రమోషన్స్ కాస్త కామెడీగా అనిపించినా.. బ్యూటిఫుల్ హీరోయిన్స్, హెవీ స్టార్ కాస్ట్, ఫారిన్ లొకేషన్స్, సీజీ వర్క్ అన్నీ ఆశ్చర్యంగా అనిపించాయి.
జూలై 28న ‘ది లెజెండ్’ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇంత భారీ స్థాయిలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అని అడిగితే శరవణన్ ఏం చెప్పారో తెలుసా..
‘సినిమాకి పెట్టిన ఖర్చు విషయంలో నాకు టెన్షన్ లేదు.. కేవలం నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడానికే ఇంత గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాను. ఇకముందు హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.
Leave a comment