Godse Trailer: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రామిసింగ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఇప్పుడు ‘గాడ్సే’ అనే వైవిధ్యభరితమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
గోపి గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తుండగా, సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం ‘మెగా ప్రిన్స్’ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి.
సత్య దేవ్ నటన ఆకట్టుకుంటుంది. సినిమాకి తన పర్ఫార్మెన్సే హైలెట్ అవుతుందనిపిస్తుంది. ఇశ్వర్య లక్ష్మీ, జియా శర్మ, బ్రహ్మాజీ, సిజ్జు, తనికెళ్ల భరణి, ప్రియదర్శి, నాగబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ట్రైలర్ చివర్లో ‘‘అర్హతున్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్ధతున్నోడే పార్లమెంట్లో ఉండాలి.. మర్యాదున్నోడే మేయర్ కావాలి.. సభ్యతున్నోడే సర్పంచ్ కావాలి’’ అంటూ సత్య దేవ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. జూన్ 17న ‘గాడ్సే’ రిలీజ్ అవుతోంది.
Leave a comment