క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించిన నటి కవితకి ఈ మధ్యనే విషాదం చోటు చేసుకుంది. అదే.. కరోనాతో తన కొడుకు చనిపోవడం. అది ఇంకా మరిచిపోకముందే ఆమెని మరో విషాదం చుట్టుముట్టింది. ఇలా ఇప్పటికీ తన జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు చనిపోవడం ఆమెకి తీవ్ర దుఖాన్ని కలిగించే విషయం.
ఆమె భర్త పేరు దశరథ రాజు. ఆయన ఈ రోజే కరోనాతో బాధపడుతూ.. ఆ వైరస్ తో పోరాడలేక మరణించారు. కరోనా పాజిటివ్ అని తెలినపుడు.. హోమ్ quarantine లో ఉన్న ఆయనకి సీరియస్ అవగానే.. ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స జరుగుతూ ఉండగానే మృతి చెందారాయన. ఐతే, సరిగ్గా పదిహేను రోజుల క్రితమే ఆమె కొడుకు కరోనా కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.
Leave a comment