కాస్టింగ్ కౌచ్ అనేది అమ్మాయిలకి చాలా మందికి అతి పెద్ద సమస్య. నటన మీద ఇష్టంతోనో.. లేదా బ్రతుకుదెరువు కోసం సినిమాల్లో అవకాశాలు వస్తాయని చూడడం వల్లనో వాళ్ళు ఈ సమస్య బారిన పడుతున్నారు. తమ సినిమాలోకి తీసుకోవాలి అంటే వాళ్ళకి కచ్చితంగా సెక్సువల్ ఫేవర్స్ చేయాలన్న షరతు దగ్గర అమ్మాయిలు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యపై కొంతకాలం క్రితం పెద్ద రచ్చ జరిగింది. ఆ సమయంలో చాలా మంది ముందుకు వచ్చి ఈ విషయంపై మాట్లాడారు. కానీ, వాళ్ళ అభిప్రాయంలో ఇది ఎప్పటికీ పరిష్కారం లేని సమాస్య.
ఐతే, ఇప్పటిదాకా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది సినిమాల వరకే అన్న అభిప్రాయం ఉంది. కానీ, టీవీల్లో.. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా.. ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఒకమ్మాయి. ఆమె ఎవరో కాదు. తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఒక ముఖ్య పాత్ర పోషించే నటి. విలన్ లేడీ మౌనిక దగ్గర పనిమనిషిలా చేసే ప్రియమణి. ఆమెకి గతంలో ఒకసారి అలాంటి పరిస్తితి ఎదురైనప్పుడు.. ఆ అడిగిన వ్యక్తికి ఎలాంటి వార్నింగ్ కూడా ఇవ్వకుండా.. నవ్వుతూ వెంటనే బయటికి వచ్చేసిందట.
తన మాటలు విన్న వాళ్ళు.. ఆమెకి సానుభూతిగా కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడింది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో కూడా పనిమనిషిగా చేస్తున్నట్లు సమాచారం.
Leave a comment