బాలీవుడ్ భామ శిల్పాశెట్టి.. ధన్యవంతుడైన రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అతనికి ఒక ఐపిఎల్ టీం కూడా ఉంది. ఐతే, ఆ మహానుభావుడు ఇప్పుడు ఒక పోర్న్ కేసులో కీలక వ్యక్తిగా పట్టుబడ్డాడు. ఈ వార్తా బయటికి రాగానే మొత్తం బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమీషనర్ హేమంత్ స్వయంగా వెల్లడించారు.
ఐతే, ఈ విషయానికి సంబంధించి ఇది ఒక్కసారిగా బయటికి వచ్చిన వార్తేమీ కాదు. రాజ్ కుంద్రా మీద ఫిబ్రవరిలోనే ఒక కేస్ ఫైల్ అయింది. పోర్న్ చేయించి.. డాన్ని రికార్డ్ చేసి.. కొన్ని ఆప్స్ ద్వారా పబ్లిష్ చేస్తున్నారన్న ఆరోపణ మీద ఆయన మీద ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన పోలీస్ లు ఎట్టకేలకు ఆధారాలతో సహా అతన్ని పట్టుకున్నారు. ఆ కంప్లైంట్ కి సంబంధించి కావాల్సిన ఆధారాలన్నీ దొరికినట్టు కూడా చెప్పారు హేమంత్.
రాజ్ కుంద్రాతో పాటు.. మొత్తం తొమ్మిది మందిని ఆధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లా ప్రకారం పబ్లిక్ ప్లేసెస్ లో సెక్స్ తప్పు. ఐతే కుంద్రా ఈ తరహా వీడియవలని రికార్డ్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతున్నారు. అలాగే పాపులర్ నటి, మోడల్ పూనమ్ పాండే కూడా రాజ్ కుంద్రాపై కేస్ వేసింది. తనతో కాంట్రాక్ట్ టెర్మినేట్ ఐపోయిన తర్వాత కూడా తనతో క్రియేట్ చేసిన కంటెంట్ ని ఇంకా వాడుకుంటున్నట్లు ఆరోపించింది. ఈ విషయం మీద కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.
Leave a comment