మనం ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి ఇచ్చినట్టు… బిగ్ బాస్ హౌస్ లో కూడా ఊహించినవి ఎన్నో జరిగాయి. గత వంద రోజులుగా బిగ్ బాస్ లో కొట్టుకొని చచ్చిపోయిన కంటెస్టెంట్స్ ఎట్టకేలకు హౌస్ నుంచి బయటికి వచ్చేసారు. ప్రస్తుతం కుటుంబాలతో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మొదటి నుంచి ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే రనర్ గా పల్లవి ప్రశాంత్, విన్నర్‌గా శివాజీ ఉంటారని అందరూరూ అనుకున్నారు.
సోషల్ మీడియాలో కూడా నిన్నటి వరకు ఇదే ప్రచారం జరిగింది. శివాజీ అభిమానులు కూడా అదే రేంజ్ లో ఓటింగ్స్ కోసం ప్రమోట్ చేసారు. కానీ చివరి నిమిషంలో విన్నర్ కాదు కదా రన్నర్ గా కూడా శివాజీ నిలవలేకపోయాడు. టాప్ త్రీ కంటెస్టెంట్ గానే హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనికి కారణం ఆయన హెడ్ వెయిట్, ఆయన అహంకారం ఆయన తల పొగరు అంటూ పలువురు ఘాటుగా ఆయనపై స్పందిస్తున్నారు.
హౌస్ లోకి వచ్చిన మొదటి రోజే కాపీ కోసం నానా రచ్చ చేసిన శివాజీ ఆ తర్వాత హౌస్ లో జరిగే కొన్ని విషయాల్లో కూడా అంతే సెల్ఫిష్ గా ఉన్నాడని ఆయనకు కావాల్సిన వాళ్లతో మాత్రం జలిగా ఉంటూ ఆయనకి నచ్చిని వాళ్ళని టార్గెట్ చేసే విధంగా పక్క వాళ్ళతో నామినేట్ చేయించారని.. దేవుడు అన్ని చూస్తున్నాడని అందుకే ఇలా ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అని .. అటు రన్నర్ గా కాకుండా ఇటు విన్నర్ గా కాకుండా ఎలిమినేట్ అవ్వడం ఆయనకు దేవుడు వేసిన శిక్ష అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.